Pawan Kalyan: ఆ ఒక్కటి మినహా.. యాడ్స్ కి అందుకే దూరం..!

Pawan Kalyan.. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు సినిమాలలో ఒక గుర్తింపు వచ్చిన తర్వాత పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతూ భారీగా సంపాదిస్తున్నారు.. ప్రజలకు మేలు చేస్తాయా? లేదా? అన్న విషయాన్ని ఆలోచించకుండా.. తమకు డబ్బు వస్తే చాలు అన్న రేంజిలో యాడ్స్ చేసి ఒక్కొక్కసారి కేసుల్లో ఇరుక్కున్న విషయం కూడా తెలిసిందే.. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం 2001లో వచ్చిన పెప్సీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.. అంతేకాదు పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన మొదటి సౌత్ హీరో కూడా ఈయనే .. ఇక ఈ యాడ్ తర్వాత మరే ఉత్పత్తులను ఆయన ప్రమోట్ చేయలేదు.. మరి పవన్ కళ్యాణ్ ఇలా ఏ బ్రాండ్ ను ప్రమోట్ చేయకపోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఆ నిబద్ధతే నేడు ఉప ముఖ్యమంత్రిగా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.. గత కొన్నేళ్ల నుంచి కేవలం అభిమానంతోనే సరి పుచ్చి ఓటు వేయలేదనే దాని నుంచి అన్ని ఓట్లను గంపగుత్తగా కూటమికి తరలించడంలో జనసేనాని సక్సెస్ అయ్యారు. మూడు పార్టీలు.. మూడు గుర్తులు..ఒక ఓటు కూడా పక్కకు పోకుండా చూడగలిగారు.. మొదటి నుంచి ఉన్న ఆ నిబద్ధతే ఆయనను నేడు డిప్యూటీ సీఎం గా మార్చింది.. అయితే ఈ నిబద్ధతకు నిదర్శనాలలో కూడా ఒకటి ఏ ప్రోడక్ట్ కి యాడ్ చేయకపోవడమే..

యాడ్స్ లో నంబర్ వన్ మహేష్, బన్నీ..

నిజానికి చాలామంది తెలుగు హీరోలకు సినిమాలు షూటింగ్ చేయడానికి టైం లేదు అనుకుంటాం.. కానీ వాళ్ళ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.. తమ టైం ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని.. ఇటు సినిమాలలో.. అటు యాడ్స్ అంటూ కుమ్మేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు, అల్లు అర్జున్ తెలుగులో యాడ్స్ లో నెంబర్ వన్ అనే చెప్పాలి.. సినిమాల వరకే కాదు ఇప్పుడు యాడ్స్ లోనూ .. యాక్షన్ లోనూ పీక్స్ లో చూపిస్తున్నారు.. మహేష్ బాబు మౌంటేన్ డ్యూ యాడ్లో న్యూ లుక్ తో మెస్మరైజ్ చేస్తూనే యాక్షన్ లో ఇరగదీసారు.. “మొనగాడురా భయపడడురా !”అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన యాడ్ విపరీతంగా ఆకట్టుకుంది.. అలాగే అల్లు అర్జున్ కూడా కొత్త ఆటతో సందడి చేస్తున్నాడు.. తగ్గేదేలే అన్న రీతిలో ” పైపు లీక్ అయ్యేదేలే” అంటూ ఆస్ట్రాల్ పైప్ యాడ్ లో అదరగొట్టేస్తున్నారు. ఇకపోతే సినిమాలైతే నెలల తరబడి కష్టపడాలి .. అదే వాణిజ్య ప్రకటనల్లో అయితే కేవలం రెండు రోజులు కష్టపడితే చాలు . రూ.కోట్లు లభిస్తాయి.. అందుకే హీరోలు అంతా కూడా వాణిజ్య ప్రకటనల్లో నటించడానికి పోటీపడుతున్నారు.

- Advertisement -

అందుకే యాడ్స్ లో చేయడం లేదు..

అయితే వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ దూరం అనే చెప్పాలి.. పవర్ స్టార్ గా ఎదిగి.. స్టార్డం తెచ్చుకున్న ఈయన యాడ్స్ మాత్రం చేయరు. పవన్ కళ్యాణ్ 2001లో చేసిన పెప్సీ యాడ్ మాత్రమే ఆయన ఖాతాలో ఉంది.. ఇక అంతకుముందు.. ఆ తర్వాత ఏ ఒక్క యాడ్ లోను నటించలేదు.. దీనికి కారణం అడిగితే పెప్సీ వల్ల హెల్త్ సమస్యలు వస్తాయి.. ప్రజలకు మంచిది కానప్పుడు నేను చేయకూడదు అని తెలిపారు.. పెప్సీ వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఉందని..అందుకే ఆ యాడ్ వదిలేసాను.. ఆ తర్వాత షారుక్ ఖాన్ కి ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ ఇస్తామన్నారు.. కానీ నేను నా నమ్మకాలు వదిలేసి డబ్బుల కోసం యాడ్స్ చేసి ప్రజల ఆరోగ్యాలను పాడు చేయలేను ..అందుకే నో చెప్పాను అంటూ తెలిపారు పవన్ కళ్యాణ్ .. ఇక నాడు ప్రజల కోసం ఆలోచించాడు కాబట్టే నేడు ప్రజల డిప్యూటీ సీఎం గా పట్టం కట్టారని చెప్పవచ్చు.

అందుకే పెప్సీ యాడ్ చేశా..

Pawan Kalyan: Except for that one thing.. That's why I stay away from ads..!
Pawan Kalyan: Except for that one thing.. That’s why I stay away from ads..!

అయితే పెప్సీ యాడ్ చేయడానికి కూడా గల కారణాన్ని ఆయన తెలిపారు. ఒకసారి పొలం కొనడానికి డబ్బులు సరిపోకపోవడంతోనే యాడ్ చేశానన్నారు. ఆ ప్రకటనలో నటించినందుకు రూ.40 లక్షలు ఇచ్చారని తెలిపారు.. అయితే ఆ తర్వాత ఆ డ్రింక్ మంచిదా..? కాదా..? అనేది అనవసరమనీ. ఆ పనికి న్యాయం చేయలేననే ఉద్దేశంతోనే యాడ్స్ లో కనిపించడం లేదు. పవన్ అంటే ప్రజలకు మేలు చేయాలి కానీ కీడు చేసేవాడు కాకూడదని..ఆ ఆలోచనతోనే యాడ్స్ చేయడం లేదు అంటూ స్పష్టం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు