GabbarSingh : అక్కడ అల్ టైం రికార్డ్ పై కన్నేసిన గబ్బర్ సింగ్.. మామూలు ప్లానింగ్ కాదు!

GabbarSingh : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లోనే బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పెండింగ్ లో ఉన్న తన సినిమాలు ఎప్పుడొస్తాయో కూడా తెలీని పరిస్థితి. ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. జనసేనాని ఇప్పుడున్న పరిస్థితుల్లో తన సినిమా ఈ ఏడాది వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అందుకే అభిమానుల కోసం తాను నటించిన పాత సినిమాలు బర్త్ డే స్పెషల్ గా రీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక ఈ ఇయర్ పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ గా గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. పన్నెండేళ్ల కింద వచ్చిన తన సెన్సేషనల్ కం బ్యాక్ హిట్ చిత్రం “గబ్బర్ సింగ్” ఇప్పుడు సెప్టెంబర్ 1న రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రమోట్ చేస్తున్నారు.

Pawan Kalyan fans are planning to go to All Time Records with the re-release of Gabbar Singh

అల్ టైం రికార్డులపై కన్నేసిన గబ్బర్ సింగ్..

ఇక పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాను ఈసారి భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగుళూర్ వంటి సిటీలో కూడా భారీగా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా యూఎస్ లో కూడా ఈ సినిమాకి ఊహించని ప్లానింగ్ చేస్తున్నారని తెలిసింది. గబ్బర్ సింగ్ ని ఓవర్సీస్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ వారు డిస్ట్రిబ్యూట్ చేయనుండడం విశేషం. రీసెంట్ గా వీరు ప్రభాస్ నటించిన ‘కల్కి2898ఎడి’ సినిమాని రిలీజ్ చేశారు. త్వరలో పవన్ “ఓజి” ని కూడా వీరే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గబ్బర్ సింగ్ సినిమాను ఈసారి ఓవర్సీస్ లో భారీ లెవెల్లో రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

- Advertisement -

ఇక్కడ అల్ టైం రికార్డ్ పై కన్ను..

ఇక ఓవర్సీస్ లో గబ్బర్ సింగ్ సినిమా కోసం అల్ టైం రికార్డ్ కోసం ఫ్యాన్స్ ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. గబ్బర్ సింగ్ ని యూఎస్ లో ఏకంగా 100 స్క్రీన్స్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. ఈసారి ఓవర్సీస్ లో అల్ టైం రికార్డ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఓవర్సీస్ లో రీ రిలీజ్ మూవీస్ లో ఇంతకు ముందు సింహాద్రి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. ఆ సినిమా అక్కడ 58k డాలర్స్ ఓపెనింగ్స్ తెచ్చుకోగా, ఆ తరవాత ఖుషి 48k తో, మురారి 43k తో నిలిచాయి. ఇక గబ్బర్ సింగ్ తో వీటి రికార్డ్ బ్రేక్ చేయాలనీ పీకే ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో రీ రిలీజ్ లో ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు