Waltair Veerayya : బాస్ పార్టీలో తమ్ముడు

గాడ్ ఫాదర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే ఓ పవర్ ఫుల్ మూవీ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని విశాఖ నేపథ్యంలో జాలరుల జీవితాలకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కించనున్నారు.

చిరంజీవి చాలాకాలం తర్వాత మాస్ ఆడియన్స్ ని పూర్తిస్థాయిలో మెప్పించేలా ఈ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చేస్తున్నారు. లుక్, మేనరిజం చూసిన అభిమానులు ఇది మరో ‘ఘరానా మొగుడు’ అవుతుందంటూ అప్పుడే జోస్యం మొదలు పెట్టేశారు. ఇక తాజాగా విడుదలైన బాస్ సాంగ్ ప్రోమోలు లుంగీ కట్టేసుకుని, షర్ట్ మడతట్టేసుకుని, కర్చీఫ్ చుట్టేసుకుని రెడీగా ఉండాలంటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సాంగ్ గురించి హింట్ ఇచ్చేశాడు.

ఈ బాస్ పార్టీ సాంగ్ ని సెట్ లో పవన్ కళ్యాణ్ కి చూపించిన చిరంజీవి, అతని హావ భావాల్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ వెంట హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ ఉండగా, చిరంజీవి పక్కన డైరెక్టర్ బాబీ కనిపించారు. ఈ సందర్భంగా బాస్ పార్టీ సాంగ్ ను పవర్ కళ్యాణ్ చేశాడు. సాంగ్ సూపర్ గా ఉంది అని కూడ అన్నట్టు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు