BRO : సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలనం

టాలీవుడ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలన్న, ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ బ్రేక్ చేయాలన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరువాతనే అని మరోసారి రుజువైంది. ఒక పక్క రాజకీయాలలో బిజీగా ఉంటూనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈరోజు సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. తన సినిమాల ప్రమోషన్స్ కు మరియు తన ఫ్యాన్స్ తో ఇంట్రాక్షన్ ను మరింత పెంచుకునే ఉద్దేశ్యంతో ఆయన ఇవాళ ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టగా ఇంటర్నెట్ స్తంభించిపోయిందని చెప్పాలి.

కేవలం తాను ఎకౌంట్ క్రియేట్ చేసుకున్న కొద్దీ సేపట్లోనే ఏకంగా 1 మిలియన్ ఫాలోయర్స్ సంపాదించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం నడుస్తున్న ఈ ఆన్లైన్ ట్రెండ్ లలో అందరు తమ, తమ సోషల్ మీడియా ఎకౌంట్ లలో ఫాలోయర్స్ ను పెంచుకోవడనికి నానా ప్రయత్నాలు చేస్తుంటే, పవన్ కళ్యాణ్ కు అసలు ఒక పోస్ట్ కూడా ఇంకా పెట్టకుండానే 1 మిలియన్ ఫాలోయర్స్ రావడం అనేది ఆయన ఫ్యాన్ బేస్ కు నిదర్శనం అని చెప్పాలి

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. త్రివిక్రమ్ రచన సహకారం అందిస్తుండగా, సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే పవన్ కళ్యాణ్ ఇక నుండి ఆయన తన రాబోయే సినిమాలన్నింటి ప్రమోషన్స్ ఇంస్టాగ్రామ్ ద్వారానే హ్యాండిల్ చేయనున్నాడు. తన రాజకీయ మీటింగ్స్ మరియు కార్యకలాపాల దృష్ట్యా ఆయన సినిమాలు ఎఫెక్ట్ అవ్వకుండానే ఉద్దేశ్యం పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెల్సుతోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు