Pawan Kalyan: 2019 లోనే… నువ్వు ఓడిపోయిన పర్లేదు.. ‘పాలకొల్లు’ నుండి పోటీ చేయమని చెప్పారు.

Pawan Kalyan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంతటి కీలకపాత్రను వహిస్తున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరియర్ పీక్లో ఉన్న టైంలో సినిమాలు గ్యాప్ ఇచ్చి 2014లో జనసేన పార్టీని స్థాపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే ఆ పార్టీ స్థాపించిన తర్వాత వెంటనే పోటీ చేయకుండా ప్రశ్నించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత 2019లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమిని చవిచూశారు. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ ను చాలా మంది పర్సనల్ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ మళ్లీ పదవిని చేపట్టడానికి కీలకపాత్రను వహించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ కూడా 21 సీట్లలో పోటీ చేస్తే 100% సక్సెస్ రేట్ తో గెలిచారు. అయితే ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్న బన్నీ వాస్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జిఎటు బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించాడు బన్నీవాస్.

Bunny Vas

- Advertisement -

అయితే బన్నీ వాసు కి పవన్ కళ్యాణ్ జనసేన టికెట్ ఇవ్వలేదు అంటూ చాలా వార్తలు బయటకు వచ్చాయి. జనసేన టికెట్ ఇవ్వకపోవడం వల్లనే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసిపి కాండేట్ కి సపోర్ట్ చేశాడు అంటూ కూడా కొంతమంది రాసుకొచ్చారు. దీనిపై స్పందించారు బన్నీ వాసు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బన్నీ వాసును 2019లోని పాలకొల్లు నుంచి పోటీ చేయమని అడిగారట, దానికి బన్నీ వాసు నేను ఇంకా చిన్నవాడిని రాజకీయాల్లో నాకు అంతటి అనుభవం లేదు అని చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్ గా కూడా పాలకొల్లు నుంచి పోటీ చేయమని అడిగితే అరవింద్ గారిని అడిగి చెప్తా అని చెప్పారట. దానికి సమాధానం గా పవన్ కళ్యాణ్ నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకున్నప్పుడే నాకు చెప్పు అని చెప్పారు. ఈ విషయం స్వయంగా బన్నీ వాస్ చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు