Pawan Kalyan: బన్నీ వాసు కి పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చా.? ఖుషి సినిమా చూసిన తర్వాత ఏమైంది అంటే.?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో రెండు రాష్ట్రాలకు తెలుసు. తన కెరీర్లో చేసిన చాలా తక్కువ సినిమాల అయినా కూడా అంత క్రేజ్ సాధించడం మామూలు విషయం కాదు. దీనికి కారణం వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేయడం మాత్రం కాదు అంతకుమించి ఆయన వ్యక్తిత్వం చాలా మందిని ఆకర్షించింది అని చెప్పాలి. ఎందుకంటే వరుసగా డిజాస్టర్ సినిమాలు పడినా కూడా ఆయనకి అభిమానం క్రేజ్ తగ్గకుండా రెమ్యునరేషన్ పెరుగుతూ వచ్చింది. సమాజం పట్ల ఆయన ఎంత బాధ్యతగా ఉంటారు చాలాసార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి సమాజ సేవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ప్రతి మొదటి పాటలో సొసైటీకి ఉపయోగపడే ఒక మెసేజ్ ఇస్తూ ఉండేవాడు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ లోని ఆకట్టుకునే అంశాలుగా చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలుసు. రీసెంట్ గా ఆ సినిమాను రిలీస్ చేసినప్పుడు కూడా చాలామంది ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అయితే ఖుషి సినిమాతో ప్రతి ఒక్కరికి ఒక్కో పర్సనల్ అనుభవం ఉంది. అలా బన్నీ వాసు విషయానికి వస్తే ఖుషి(Kushi) సినిమా చూసిన తర్వాత వాళ్ల నాన్న దగ్గర అంబాసిడర్ కారు తాళాలు దొంగలించి హైదరాబాద్ వరకు ఒక్కరే డ్రైవింగ్ చేసుకుని వచ్చేసారట. నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటూ ఈ ఉదాహరణ చెప్పారు.

 Kushi

- Advertisement -

ఇక బన్నీ వాసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ ఫ్రెండ్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన కూడా ఒక నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గీత ఆర్ట్స్ టు బ్యానర్ లో బన్నీ వాసు సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. బన్నీ వాసు(Bunny Vasu) ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం బన్నీ వాసు నిర్మిస్తున్న సినిమా ఆయ్. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అదే రోజు చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నా కూడా ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో దీనిని కూడా రిలీజ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు