Pawan Kalyan: సినిమా వాళ్ళు వస్తారు పోతారు కానీ వాళ్ళు ఏం చేయలేరు, నటుడు మురళీమోహన్ సంచలన కామెంట్స్

Pawan Kalyan: రాజకీయాలకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019 నుంచి 2024 ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అంతగా సత్సంబంధాలు లేవు కానీ ఒకప్పుడు మాత్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పొలిటికల్ పార్టీస్ మంచి గౌరవం ఇచ్చాయి. ఒక సందర్భంలో హుదూద్ అనే తుఫాను వచ్చినప్పుడు వైజాగ్ సిటీ మొత్తం అల్లకొల్లాలు అయిపోయిన తరుణంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా ఏకధాటిపై నిలబడి ఎన్నో ఈవెంట్స్ కండక్ట్ చేసి ఆ వచ్చిన ఫండ్ ను అప్పట్లో ఉన్న ప్రభుత్వానికి అందజేశారు. చాలామంది విరాళాలు ఇచ్చారు.

ఇకపోతే 2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే ఒక పార్టీని స్థాపించారు. ఆ పార్టీని స్థాపించి టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి సపోర్టుగా నిలిచారు. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజారిటీతో గవర్నమెంట్ ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2019 వ సంవత్సరంలో తన పార్టీ తరఫున ఒంటరిగా పోటీ చేయడం మొదలుపెట్టాడు. పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయాడు. తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోయింది. వైఎస్ఆర్సిపి పార్టీ విజయం సాధించింది. అయితే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకొని వైఎస్ఆర్సిపి పరిపాలన కొనసాగించింది. సినిమా టికెట్ రేట్లను తగ్గించడం వంటి ఎన్నో పనులను చేసింది.

Pawan Kalyan urges voters to turn up early at polling stations

- Advertisement -

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీనికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దాదాపు తెలుగుదేశం ఓటమి ఖాయం అనుకున్న తరుణంలో వైసిపి పార్టీకి ఉన్న వ్యతిరేక ఓటును చీల్చనివ్వను అంటూ ఒక వ్యూహాన్ని రచించి పోటీలోకి దిగి ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా అధికారాన్ని సంపాదించాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ విజయాన్ని చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు అభినందించారు.

ఇక రీసెంట్ గా ప్రముఖ నటుడు నిర్మాత మురళీమోహన్ పవన్ కళ్యాణ్ పై సంచలమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు ఏమీ చేయలేరు అనుకున్న తరుణంలో పవన్ కళ్యాణ్ వచ్చి తనే ముందుకు వెళ్లి కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కీలకమైన పాత్రను పోషించాడు. దాదాపు 10 ఏళ్ళు పైగా కష్టపడుతూ ఈరోజు సక్సెస్ చూశాడు. అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు