Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ కాస్ట్ 1000-1500/- వరకు పెట్టమన్నారట

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా ఏ హీరో కైనా వరుసగా సినిమాలు ఫెయిలవుతున్నప్పుడు మార్కెట్ దెబ్బతింటుంది అభిమానులు తగ్గిపోతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం అలా జరగలేదు సినిమా ఫెయిల్ అవుతున్న కొద్ది పవన్ కళ్యాణ్ మార్కెట్ పెరిగింది. పవన్ కళ్యాణ్ కి రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. అభిమానులు కూడా ఎక్కువయ్యారు. దీని అంతటికి కారణం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అని చెప్పొచ్చు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ సమాజం గురించి ఎంతలా పట్టించుకుంటారు చాలాసార్లు రుజువు అవుతూ వచ్చింది. ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి పవన్ కళ్యాణ్ సాయం చేస్తూ వచ్చారు. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించి ప్రశ్నించడమే ధ్యేయంగా ముందుకెళ్లారు. అయితే 2014లో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ స్వయంగా 2019లో రెండు చోట్ల పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు ప్రాంతాల్లోనూ ఓడిపోయారు. అక్కడితో పవన్ కళ్యాణ్ ని చాలామంది విమర్శించడం మొదలుపెట్టారు.

ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతను వహిస్తున్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీని ఎంతగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా టికెట్ రేట్లు కూడా పూర్తిగా తగ్గించేసింది. మెగాస్టార్ చిరంజీవి కొంతమంది స్టార్ హీరోలను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి అడుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ మారింది కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి చాలామంది నిర్మాతలు వెళ్లి కలిసి మాట్లాడారు. అయితే టికెట్ రేట్ల విషయంలో నార్త్ లో జరిగే మాదిరిగానే టికెట్ కాస్ట్ 1000 నుంచి 1500 వరకు ఉండేటట్లు సలహాలు ఇచ్చారు.

- Advertisement -

Film producers with Deputy CM Pawan Kalyan

అయితే దీనికి నిర్మాతలు అందరూ కూడా ఒప్పుకోకుండా ఇలా చేస్తే తెలుగులో వర్కౌట్ అవ్వదు అని గ్రహించి మామూలుగా తమ టికెట్ రేట్లను పెంచుకున్నారు అంటూ అశ్విని దత్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ చెప్పినట్లు అదే జరిగినట్లయితే ఈపాటికే చాలామంది పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేసేవారు. మొత్తానికి నిర్మాతలు మంచి నిర్ణయం తీసుకున్నారని చాలామంది నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు