Pawan Kalyan – Niharika: బాబాయ్ పై నిహారిక అలాంటి కామెంట్స్.. ఊహించలేదుగా..?

Pawan Kalyan – Niharika: మెగా వారసురాలు నిహారిక కొణిదెల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు పదిమందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతుంటే.. ఈ కుటుంబం నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ గా నిహారిక రికార్డు సృష్టించింది. అయితే ఈమె హీరోయిన్గా అడుగు పెట్టింది కానీ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. అందుకే ప్రస్తుతం నిర్మాతగా మారి పలు సినిమాలను, వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది ఈ ముద్దుగుమ్మ . ఈ క్రమంలోనే ఇటీవల కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాను కూడా నిర్మించింది.

Pawan Kalyan - Niharika: Niharika comments like that on Babay.. did you not expect..?
Pawan Kalyan – Niharika: Niharika comments like that on Babay.. did you not expect..?

బాబాయ్ పవన్ కళ్యాణ్ ను అలాగే చూడాలని కోరిక – నిహారిక

ఆగస్టు 9వ తేదీన ఈ కమిటీ కుర్రాళ్ళు సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నిహారిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన బాబాయ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిహారిక మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ బాబాయ్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా మాకు ఇప్పటికీ పవర్ స్టారే. ఎన్నికల ఫలితాలు ముందు రోజు కూడా అందరం ఇంట్లో టీవీ ముందే ఉన్నాము.. మా అమ్మాయి అయితే ఎంతో ఎమోషనల్ అయింది.. బాబాయ్ స్పీచ్ లు చాలా బాగుంటాయి అవి నన్ను ఎంతో ఇన్స్పైర్ చేశాయి కూడా. బాబాయ్ రాజకీయాల్లో ఉన్నా కూడా స్టారే. బాబాయ్ ని ఎక్కువగా రాజకీయ నాయకుడుగానే మేమంతా ఇష్టపడతాము అంటూ తెలిపింది నిహారిక. మొత్తానికైతే తన బాబాయిని రాజకీయ నాయకుడిగానే చూడాలని కోరుకుంటున్నట్లు కూడా స్పష్టం చేసింది.

బాబాయ్ పేరును అలా సేవ్ చేసుకున్నా ..

అంతేకాదు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ మొబైల్ నెంబర్ ను తన మొబైల్ లో ఎలా ఫీడ్ చేసి ఉంటుందో కూడా తెలిపింది నిహారిక. ఫోన్లో పవన్ కళ్యాణ్ పేరు KKK పని సేవ్ చేసి ఉంటుందట. KKK అంటే కొణిదెల కళ్యాణ్ కుమార్ అని.. పవన్ కళ్యాణ్ బాబాయ్ పేరు అంటూ ఆమె తెలిపింది. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ పై నిహారిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు.

- Advertisement -

బిజీగా మారిన పవన్ కళ్యాణ్..

పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు ప్రజలకు మంచి చేకూర్చాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు.. అందులో భాగంగానే జనసేన పార్టీని ఈసారి 21 స్థానాలలో పోటీ చేయించి 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన పవన్ కళ్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టారు .అంతేకాదు సమాజంలో జరిగే ప్రతి అంశంపై కూడా స్పందిస్తూ ఇప్పుడు రాజకీయంగా మరింత వేగంగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాలలో కాస్త సమయం దొరికితే తాను నటించాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్, OG , హరిహర వీరమల్లు సినిమాలను పూర్తిచేసే పనిలో పడ్డారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమాల పరంగానే కాదు నిజజీవితంలో కూడా ప్రజలకు మేలు చేస్తారని అందరూ విశ్వసిస్తున్నారు. మరి ఈ ఐదేళ్ల పరిపాలనలో ఆయన ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు..? తనను నమ్ముకున్న దర్శక నిర్మాతలకు ఎటువంటి న్యాయం అందిస్తారు..? రెండు పడవల మీద ఒకేసారి ప్రయాణం పవన్ కళ్యాణ్ కు ఏ విధంగా కలిసి వస్తుంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు