Pawan Kalyan : నితిన్ ఆ పని ఏం చేయట్లేదు… ఇప్పుడు అకీరా హ్యాపీనే

Pawan Kalyan : తేజ దర్శకత్వం వహించిన జయం అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. అప్పట్లో తేజ కి ఉన్న ఫాలోయింగ్ వలన ఆ సినిమా మంచి హిట్ అయింది. అక్కడితో హీరోగా సెటిల్ అయిపోయాడు నితిన్. సినిమా తర్వాత చేసిన దిల్ సినిమా కూడా మంచి హిట్ అయింది. ఈ సినిమాతోనే నిర్మాతగా అడుగులు వేశాడు దిల్ రాజు. ఈ సినిమాల తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సై అనే సినిమాను చేశాడు నితిన్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ ను సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ సక్సెస్ చూడటానికి చాలా టైం పట్టింది.

ఇంక నితిన్ పని అయిపోయింది సినిమాలు ఆపేయవచ్చు అనుకునే తరుణంలో, విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఇష్క్ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ తరుణంలోనే పవన్ కళ్యాణ్ కి నితిన్ ఎంత పెద్ద అభిమాని అని చాలామందికి తెలిసి వచ్చింది. అప్పటినుంచి నితిన్ సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నితిన్ చేసిన సినిమాలలో పవన్ కళ్యాణ్ పాటలు పెట్టడం రిఫరెన్స్ తీసుకోవడం ఇలాంటివి చాలా జరిగాయి.

Pawan Kalyan

- Advertisement -

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ టైటిల్ను వాడుతూ ఒక సినిమా చేస్తున్నాడు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలోని మరో పాటను రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలు విన్న వెంటనే చాలామంది ఫీల్ అయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా ఉన్నాడు. ఒకవేళ అఖీరా సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పాటలు తప్ప ఇంకో సినిమా పాటలు రీమిక్స్ చేయడానికి ఉండవని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఈ వార్త వైరల్ అవుతున్న కొద్దిసేపట్లోనే ఈ వార్తల్లో నిజం లేదు. ఇవన్నీ అవాస్తవమంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు