OG : ఫైనల్ గా అన్నింట్లోకి ‘ఓజి’నే ముందొస్తుంది… ఆరోజు నుండే షూటింగ్ స్టార్ట్?

OG : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో “ఓజి” సినిమా కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మొదలైనప్పటినుండే ఓ రేంజ్ లో ఉంటుందని పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా, అన్నిటికంటే ఎక్కువగా OG కోసమే పీకే ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే అనూహ్యాంగా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం చేత అన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) భారీ మెజార్టీతో గెలవడం, ఏకంగా డిప్యూటీ సీఎం కూడా కావడం జరిగింది. ఇక సినిమాల్లో పవన్ రాక కోసమే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం వచ్చేసిందని తెలుస్తుంది. తాజాగా ఓజి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

Pawan Kalyan OG Movie Crazy Update

ఫైనల్ గా సెట్స్ పైకి ఓజి..

ఇక తాజాగా ఓజి మేకర్స్ సినిమా నుండి ఎట్టకేలకు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే ఓజి సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. తాజాగా పవన్ తో ఉన్న ఓ స్టిల్ షేర్ చేస్తూ ఈ విషయాన్నీ మేకర్స్ షేర్ చేయడం జరిగింది. ఆ స్టిల్ లో పవన్ కళ్యాణ్ గడ్డం తీసేసి ఉండగా, పవన్ తో పాటు సుజిత్, నిర్మాత దానయ్య (DVV Danayya) కూడా ఉన్నారు. ఓజి మిషన్ లో త్వరలోనే పవర్ స్టార్ ఎంట్రీ స్తున్నారని మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక పవన్ కళ్యాణ్ బహుశా ఆగష్టు చివరి వారం నుండి సెప్టెంబర్ ఓజి సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తాడని సమాచారం.

- Advertisement -

అన్నిటికంటే ముందు ఓజినే?

ఇక సెట్స్ పై పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు ఓజి సహా మూడున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే హరిహర వీరమల్లు. కానీ పవన్ కళ్యాణ్ ముందుగా ఓజి సెట్స్ లోకే ఎంట్రీ ఇస్తున్నాడని సమాచారం. థియేటర్లలో కూడా ముందు ఈ సినిమానే రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తుంది. అయితే మేకర్స్ నుండి సినిమా కొత్త రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ కాలేదు. బహుశా ఈ ఇయర్ నవంబర్ లో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరికి ఓజి ని ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇక ఓజి లో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, వెంకట్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి అతి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రానున్నట్టు తెలియచేసాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు