Pawan Kalyan : పవన్ కు అస్వస్థత… మరో సాకు అంటూ ట్రోలింగ్

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టుగా సమాచారం. ఈ వార్త తెలిసిన ఆయన అభిమానులు ఆందోళన చెందుతుంటే, సామాన్య ప్రజలు, పవన్ హేటర్స్ మాత్రం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించట్లేదు అనే విమర్శలను తప్పించుకోవడానికి మరో సాకు దొరికింది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

పవన్ కు వైరల్ ఫీవర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గా ప్రస్తుతం వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. జ్వరంతోనే ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ గురువారం ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు పవన్. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్ కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక ఆయన ఆరోగ్యం విషయానికొస్తే ప్రస్తుతం పవన్ చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.Pawan Kalyan Latest Health Update: Stable in Hospital, Being Treated For  Phlegm in Lungs

డ్యామేజ్ కంట్రోల్

అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో అనుకోకుండా వరదలు ముంచెత్తడంతో ఎంతోమంది ప్రజలు తిండి, నిద్ర లేకుండా కష్టాల పాలయ్యారు. పలు సహాయక బృందాలు రేయింబవళ్ళు కష్టపడుతూ ప్రజలను కాపాడానికి శాయాశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద ముంపు ప్రాంతాల నుంచి వస్తున్న విజువల్స్ మిగతా వాళ్ళను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా పవన్ ఎక్కడా కన్పించకపోవడం చాలామందికి షాక్ కు గురి చేసింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆయనపై దారుణంగా ట్రోలింగ్ మొదలైంది. అపొజిషన్ పార్టీ లీడర్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఓ రేంజ్ లో విమర్శించారు. ఇదంతా జరిగాక బయటకొచ్చిన పవన్ డ్యామేజ్ కంట్రోల్ పనులను మొదలు పెట్టారు.

- Advertisement -

ముందుగా వరద బాధితులకు అండగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన పవన్ ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టి మరీ తాను వరద ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించపోవడానికి కారణం ఏంటో వెల్లడించారు. తాను అక్కడికి వెళ్తే అభిమానులు చుట్టుముడతారని, దానివల్ల సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే తాను వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ పవన్ మాటలు విన్న నెటిజన్లు వరదలలో మునిగిన ప్రజలు అన్నీ దాటుకుని వచ్చి పవన్ ను చూడడానికి ఎగబడతారా? అంటూ మళ్లీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక తాజాగా ఆయనకు వైరల్ ఫీవర్ అనే వార్త బయటకు రావడంతో విమర్శలను తప్పించుకోవడానికి మరో సాకు దొరికింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆయన ఫీవర్ నుంచి త్వరగా కొలుకోవాలి అని ప్రార్థిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు