Hari Hara Veera Mallu : దూసుకొస్తున్న వీరమల్లు విజయ రథం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పూర్తి పీరియాడికల్ ఫిక్షన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ నెవెర్ బిఫోర్ పాత్రలో నటిస్తుండటంతో, అంచనాలు ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే బయటకు వచ్చాయి. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా, నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ఎంతో కాలం నుంచి హరిహర వీరమల్లు అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు పవన్ పుట్టినరోజు సందర్భంగా, అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. అయితే పవన్ పుట్టినరోజు కంటే ముందు రోజే ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం.

‘స్వాగతిస్తుంది సమరపథం, దూసుకొస్తుంది వీరమల్లు విజయ రథం’ అనే క్యాప్షన్ తో పవన్ కళ్యాణ్ పోస్టర్ ను దర్శకుడు క్రిష్ షేర్ చేశాడు. ఇక ఈ పోస్టర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్ లో దర్శనమిస్తున్నాడు. గుర్రం స్వారీ చేస్తూ.. ప్రతీకార దాహంతో ఉన్నట్లు మనకు కనిపిస్తున్నాడు. యుద్ధాన్ని గెలిచే వీరుడు గెటప్ లో కనిపించి.. తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాడు పవర్ స్టార్.

- Advertisement -

అలాగే ఈ సినిమాకు సంబంధించిన పవర్ గ్లాన్స్ ను రేపు అంటే పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం 5:45 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఈ అప్డేట్ లో కన్ఫర్మ్ చేసింది చిత్ర బృందం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు