Pawan kalyan : మరోసారి సింగర్‌గా పవర్ స్టార్.. ఈ సారి బ్లాక్ బస్టరే !

హీరోలు అంటే యాక్టింగ్ చేయడమే కాదు.. కొన్ని సార్లు తమ గొంతుతో పాటలు కూడా పాడుతున్నారు. ఈ ట్రెండ్ కొన్ని రోజుల క్రితం ఎక్కువగా కనిపించింది. అయితే ప్రస్తుతం హీరోలు సింగర్ గా మారడానికి కాస్త ఆలోచిస్తున్నారు. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం మరోసారి సింగర్ గా అవతారం ఎత్తడానికి సిద్ధమవుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు జానీ, తమ్ముడు, ఖుషి, అత్తారింటికి దారేది తో పాటు ఇటీవల వచ్చిన అజ్ఞాతవాసిలో కూడా ఒక బిట్ సాంగ్ పాడాడు.

పవన్ పాడిన ఈ బిట్ సాంగ్స్ కి ప్రేక్షఖుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ బిట్ సాంగ్స్ కాకుండా, ఫుల్ సాంగ్స్ పాడితే వినాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. కాగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరికను ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి తీర్చబోతున్నాడు. పవర్ స్టార్ ప్రస్తుతం నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ హరి హర వీరమల్లు చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి చేసుకుంది. మే నెలలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. జూలైలో షూటింగ్ పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పవర్ స్టార్ ఈ చిత్రంలో ఫుల్ లెగ్త్ సాంగ్ పాడబోతున్నాడట. వపన్ ను పాట పాడించడానికి ఎం ఎం కీరవాణి చాలా ప్రయత్నాలు చేశాడట. అలాగే పవర్ స్టార్ ను ఒప్పించాడని తెలుస్తుంది. సినిమాలో ఒక ప్రత్యేక సందర్భంలో వచ్చే పాట కోసం సింగర్ ను సెర్చ్ చేశారట. ఆ సమయంలో పవన్ పాడితే బాగుంటుందని కీరవాణి అన్నారట. కాగా, ఈ పాటను త్వరలోనే రికార్డ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు