Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి తెలంగాణ ఫ్యాన్స్ షాక్… రాబోయే సినిమాలపై బ్యాన్

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ఓ పని ఆయనను చిక్కుల్లో పడేసింది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న పవర్ స్టార్ అభిమానులతో పాటు మూవీ లవర్స్, సామాన్య జనాలు కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలను బ్యాన్ చేయాలి అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. పవన్ ను దేవుడులా భావించే అభిమానులు ఎందుకు ఆయనపై ఇంత సీరియస్ గా ఉన్నారు? అనే విషయంపై లుక్కేద్దాం పదండి.

పవన్ సినిమాలపై బ్యాన్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ప్రస్తుతం ఆయన ఏపీకి ఉపముఖ్యమంత్రిగా పదవి పగ్గాలు చేపట్టడంతో ఎక్కడ చూసినా ఆయన నామస్మరణ నడుస్తోంది. తెలంగాణలో ఉన్న ఆయన అభిమానులు పవన్ సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లు దద్దరిలేలా సంబరాలు జరుపుకుంటారు. అయితే ఏపీలో ఉన్న అభిమానులు మాత్రం ఒక అడుగు ముందుకేసి ఓటర్లుగా మారే అవకాశం ఉండడంతో ఆయనను ఈసారి ఎన్నికల్లో గెలిపించుకున్నారు. అయితే ఇప్పుడు ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులపై పవన్ వ్యత్యాసం చూపిస్తున్నాడు అనడానికి కారణమైంది. అసలు విషయం ఏమిటంటే తాజాగా తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan Birthday: The 'Power Star' Of Tollywood And Politics | Times Now

- Advertisement -

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఏపీకి ఏకంగా కోటి రూపాయల భారీ విరాళం ప్రకటించారు. కానీ కనీసం మాట మాత్రమైన నీట మునిగిన తెలంగాణ ప్రాంతాల గురించి ప్రస్తావించలేదు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ ప్రజల ఆగ్రహానికి కారణమైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది రానున్న పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాల కోసం సినిమాలను పక్కన పెట్టినా సహించిన ఆయన అభిమానులు ఏపీకి సాయం చేసి, తెలంగాణను ఇలా చిన్న చూపు చూడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ చేసిన ఈ పని ఎలాంటి వివాదానికి దారి తీస్తుందో చూడాలి.

పవన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్…

నిజానికి ఏపీలో వరదల పైన కూడా పవన్ స్పందించడానికి చాలా టైం తీసుకున్నాడు. ఆయన సమయానికి రియాక్ట్ కాకపోవడంతో చాలామంది సోషల్ మీడియాలో పవన్ మిస్సింగ్ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆలస్యంగా కళ్ళు తెరిచిన పవన్ కళ్యాణ్ ఏపీకి కోటి రూపాయల విరాళాన్ని అనౌన్స్ చేశాడు. దీంతో తెలంగాణలో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మిస్సింగ్ అంటూ పోస్టర్లు వెలిస్తేనో లేదంటే సోషల్ మీడియాలో మిస్సింగ్ అని ట్రెండ్ చేస్తేగాని స్పందించరా ఏంటి అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు టీఎస్ లో ఉన్న జనాలు. అంతేకాదు ఇక్కడ ఆయన సినిమాలను బ్యాన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది అంటూ ఫైర్ అవుతున్నారు. మరి వారికి పవన్ ఏం సమాధానం చెబుతారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు