Pawan Kalyan : ఉన్న సినిమాలకే ఏమి చెప్పలేకపోతున్నారు! మళ్ళీ కొత్తదా?

Pawan Kalyan : టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ హీరోల అభిమానుల్లో చాలా డిస్సపాయింట్ గా ఉన్న ఫ్యాన్స్ అంటే అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే చెప్పాలి. అందరు స్టార్ హీరోల సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుండగా, అందరికంటే ముందు స్టార్ట్ చేసి, ఫినిషింగ్ స్టేజ్ కి కూడా వచ్చేసిన పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రం రిలీజ్ కి నోచుకోవడం లేదు. పైగా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా మూడు సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటించగా, అందులో ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ కి రెడీ గా లేదు. దానికి కారణం కూడా తెలిసిందే. జనసేనాని ఎన్నికల హడావిడే కారణం కాగా, ఇప్పుడు గెలిచేసి ఏకంగా డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు. కానీ ఇప్పటివరకు ఏ సినిమా సెట్స్ లో పాల్గొనలేదు. నిర్మాతలు మాత్రం తమ సినిమా పూర్తి చేస్తాడని ఎప్పటికప్పుడు ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ నుండే రెస్పాన్స్ లేదని చిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ మరో సినిమా గురించి తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan Upcoming Movie Update

పవర్ స్టార్ తో సినిమా ఖచ్చితంగా ఉంటుంది…

ఇదిలా ఉండగా లేటెస్ట్ గా విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ అనే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరగగా, అనంతరం ప్రెస్ మీట్ జరిగింది. అయితే ఆ ప్రెస్ మీట్ లో సినిమా నిర్మాతను ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు విలేఖరి. పవన్ కళ్యాణ్ తో సినిమా ఉందన్నారు అది ఎంతవరకు వచ్చింది అనగా, దానికి నిర్మాత రామ్ తాళ్లూరి రిప్లై ఇస్తూ, పవన్ కళ్యాణ్ తో సినిమా ఖచ్చితంగా ఉంటుందని, డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకుడని, ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీ గా ఉందని, పవర్ స్టార్ కోసమే వెయిట్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. అలాగే మొన్ననే పవన్ కళ్యాణ్ ని కూడా కలిశానని నిర్మాత రామ్ తాళ్లూరి చెప్పుకొచ్చాడు. ఇక ఈ టాపిక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుండగా అభిమానుల రియాక్షన్ మాత్రం ఊహించని విధంగా ఉంది.

- Advertisement -

ఉన్న సినిమాలకే దిక్కులేదు.. మళ్ళీ కొత్తదా?

ఇకపోతే లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి మాట్లాడిన రామ్ తల్లూరి పై, అలాగే సురేందర్ రెడ్డి గురించి ఇండస్ట్రీలో పలు రకాలుగా వార్తలు వస్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం కాస్త భిన్నంగానే స్పందించారు. అదేంటంటే పవర్ స్టార్ ఇప్పటికే సెట్స్ పై మూడు సినిమాలుంచాడు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, తో పాటు ఓజి కూడా ఉంది. కానీ ఈ సినిమాలు ఎప్పుడొస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గురించి ఆలోచిస్తాడా? ముందు సెట్స్ పై ఉన్న సినిమాలు రిలీజ్ చేస్తే చాలురా బాబు.. అనేలా పీకే ఫ్యాన్స్ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇటు సినిమా ఫ్యాన్స్ బాధ కూడా అర్ధం చేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు