Pawan Kalyan: తన చిన్నప్పుడు ఫోటో షేర్ చేసిన పవన్ కళ్యాణ్, బెంగాల్ టైగర్ అంటూ కామెంట్లు

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు వరుసగా డిజాస్టర్లు అయినా కూడా క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా రెమ్యూనరేషన్ పెరుగుతూ వెళ్లిన ఏకైక హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే థియేటర్ వద్ద ఒక పండగ వాతావరణం ఉండేది. ఇప్పుడైతే ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోగలుగుతున్నాం కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్లు కావాలి అని అంటే ఎన్నో రికమండేషన్లు.
ఇక ప్రస్తుతం ఒకవైపు సినిమాల్లోనూ మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా మారారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాలో రాయల్ బెంగాల్ టైగర్ అంటూ ఒక డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు అదే బెంగాల్ టైగర్ అనే పదాన్ని సోషల్ మీడియాలో వాడారు పవన్ కళ్యాణ్. చిన్నప్పుడు తన సోదరి తో పాటు కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ షేర్ చేస్తూ రాయల్ బెంగాల్ టైగర్స్ తో అని రాసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pawan Kalyan

- Advertisement -

కాగా 2014లో జనసేన అనే పార్టీని స్థాపించి దాదాపు ఒక పదేళ్లపాటు శ్రమించిన తర్వాత రాజకీయాల్లో కూడా తనదైన ముద్రను వేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకవైపు సినిమాల్లో కూడా మంచి బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడు సినిమాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే అందరికీ ఓజీ పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ లో ఎలా ఉంటారో , ఓజి కూడా అదే గెటప్స్ తో మొదట ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు