Pawan Kalyan With Anasuya : పవన్ కళ్యాణ్ తో అనసూయ – వినడానికి అదోలా ఉంది… ఎలా చూడాలో..?

Pawan Kalyan With Anasuya : బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయినా కూడా ప్రముఖ ఛానల్ ఈటీవీలో వచ్చే జబర్దస్త్ అనే షో తో మంచి గుర్తింపును సాధించుకుంది. ఆ షో తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఇకపోతే అనసూయ చేసిన ఎన్నో పాత్రలకి మంచి గుర్తింపు ఉంది. వీటన్నింటినీ మించి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రలో కనిపించి అద్భుతమైన ఇమేజ్ సొంతం చేసుకుంది.

రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమాలో దాక్షాయిని అనే పాత్రలో కనిపించి మరోసారి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఈ సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సాధించింది. ఇకపోతే మంచి ఫేమ్ సాధించడంతో బుల్లితెరపై జరిగే చాలా షోస్ కు గెస్ట్ గా కూడా హాజరవుతుంది అనసూయ. ఇక రీసెంట్గా ఒక డాన్స్ షోకి గెస్ట్ గా హాజరైన అనసూయ ఒక కీలకమైన విషయాన్ని రీవీల్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తను ఒక మాస్ బీట్ సాంగ్ చేశానంటూ చెప్పుకొచ్చింది. ఆ షో టీవీల్లో మాత మోగిపోద్ది అంటూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Anasuya bharadwaj

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైనప్ లో పెట్టాడు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓ జి వంటి సినిమాలు పవన్ కెరియర్ లో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని తీయడంలో హరీష్ శంకర్ ముందు ఉంటాడు. ఇప్పుడు అనసూయ చెప్పిన పాట కూడా ఇదే సినిమాలో ఉండబోతుంది అని కొంతమంది అభిప్రాయం. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు మాత్రమే తన డేట్స్ కేటాయించారు. కొన్ని రోజుల్లో కూడా అద్భుతమైన ఔట్పుట్ ను రాబట్టగలిగి రెండు టీజర్లను రిలీజ్ చేశాడు హరీష్.

ఓజి సినిమాకు సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిషింగ్ దశలో ఉంది. ఈ సినిమాలోనే అనసూయతో ఒక మాస్ సాంగ్ ను బహుశా సుజిత్ ప్లాన్ చేసి ఉంటాడేమో అనేది కొంతమంది అభిప్రాయం. లేకుంటే హరిహర వీరమల్లు సినిమాలో ఆయన ఈ సాంగ్ ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఎవరికీ క్లారిటీ లేదు. బట్ కొంతమంది మాత్రం అనసూయతో సాంగ్ ఏంటి అని అంటూ పెదవి విరుస్తున్నారు. వినడానికి ఏదోలా ఉంది ఎలా చూడాలో ఏంటో అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు