Pawan Kalyan: పవన్ ప్రమాణ స్వీకారం..వీడియో తీస్తున్న భార్య..!

Pawan Kalyan with Wife Anna Lezhneva Spotted: ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయింది. జగన్మోహన్ రెడ్డి ని ఓడించిన… తెలుగుదేశం కూటమి కొత్తగా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో… ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు.

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే… జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు డిప్యూటీ ముఖ్యమంత్రి ఖరారు అయినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే మంత్రిగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ప్రమాణ స్వీకారం చేస్తుంటే అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి.

Pawan Kalyan Wife Anna Lezhneva Visuals @ Pawan Kalyan and Chandrababu Naidu Oath Ceremony

- Advertisement -

అనే నేను అంటూ పవన్ కళ్యాణ్ మొదలు పెట్టగానే… అందరూ ఈలలు అలాగే కేకలు వేశారు. అటు తన భార్య లెజినోవా… పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం కి సంబంధించిన వీడియోను తన ఫోన్లో వీడియో తీసింది. దీనికి సంబంధించిన సంఘటన వైరల్ గా మారింది. ఇక అటు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత…. ప్రధాని నరేంద్ర మోడీకి అలాగే చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. అనంతరం తన అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు