Pawan Kalyan’s Bro: డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో విధ్వంసమా..?

Pawan Kalyan’s Bro

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. మంచి మెసేజ్ తో రూపొందిన ఈ సినిమా ఓన్లీ ఫ్యాన్స్ కోసమే అన్నట్లుంది అంటూ డివైడ్ టాక్ సొంతం చేసుకుంది.  ఒక పక్క భారీ వర్షాలు, మరో పక్క డివైడ్ టాక్ ఉన్నప్పటికీ మొదటిరోజు 27కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి 50నుండి 60కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా బ్రో విధ్వంసం మాములుగా లేదు, ఓపెన్ హామర్,బార్బీ వంటి హాలీవుడ్ సినిమాల నుండి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఓవర్సీస్ లో తక్కువ సంఖ్యలోనే థియేటర్లు దక్కాయి.

ఓవర్సీస్ లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వన్ మిలియన్ మార్క్ దాటి దూసుకుపోతుంది బ్రో. యావరేజ్ కంటెంట్ తోనే ఈ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తోందంటే, ఇక సరైన కంటెంట్ ఉండి, ఓవర్సీస్ లో డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ దక్కి ఉంటే ఓవర్సీస్ లో రికార్డులు బద్దలయ్యేవని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రిలిజ్ కి ముందు పవర్ స్టార్ సినిమా స్థాయి హైప్ లేనప్పటికీ బ్రో సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తుండటం పట్ల ఫ్యనస్ ఖుషి అవుతున్నారు.

సినిమాలో పవన్ కళ్యాణ్ పాత సినిమాల్లోని పాటలకు వింటేజ్ మ్యానరిజమ్స్ తో, మునుపటి స్టైల్ స్వాగ్ తో కనిపించటం సినిమాకే హైలైట్ అవ్వగా కథలో యువతకి మంచి మెసేజ్ ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి కూడా డీసెంట్ రెస్పాన్స్ వస్తుంది ఈ సినిమాకి. మరి, ప్రతికూల పరిస్థితులు, డివైడ్ టాక్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద బ్రో మంచి వసూళ్లు రాబడుతున్న బ్రో సినిమా ఇకమీదట ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు