Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేసిన ఫస్ట్ మూవీ

Pawan Kalyan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్నారు. వరుసగా ఏడు హిట్ సినిమాలు చేసిన తర్వాత ఒక 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ కి హిట్ సినిమా లేకపోయినా కూడా ఆదరణ తగ్గలేదు కానీ పెరిగింది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా డిజాస్టర్ అయినా కూడా కలెక్షన్స్ భారీగా వస్తాయి.

ఇకపోతే అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇస్తూ వచ్చాడు. ఆ తరుణంలో మళ్లీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ అనే సినిమాను చేసి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన పింక్ అనే సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ కి సరిపడేటట్లు అద్భుతంగా ఈ సినిమాను డిజైన్ చేసుకున్నాడు వేణు శ్రీరామ్. పవన్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ లా అనిపించింది. అయితే అప్పటికే పవన్ కళ్యాణ్ కి అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికార పార్టీతో కొన్ని విభేదాలు ఉండటం వలన ఈ సినిమా హిట్ అయినా కూడా మంచి కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది.

Tholi Prema

- Advertisement -

ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్, బ్రో అనే సినిమాలు చేశాడు. ఈ సినిమాలు కూడా మంచి టాక్ ని సాధించుకున్నాయి కానీ కలెక్షన్స్ను వసూలు చేయలేదు. అయితే ప్రస్తుతం అంతా పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేశారు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే రెమ్యూనరేషన్ తీసుకోలేదు కానీ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమాకి వచ్చిన లాభాల్లో కొంత లాభాన్ని నిర్మాత పవన్ కళ్యాణ్ కి పంపించాడు.

Tholi Prema

కరుణాకర్ దర్శకుడుగా పరిచయమైన తొలిప్రేమ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సినిమాకు సంబంధించి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ బడ్జెట్ అవ్వడం వలన పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ తీసుకోలేదట. అనూహ్యంగా సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మంచి లాభాలు వచ్చాయి. ఆ తర్వాత నిర్మాత పవన్ కళ్యాణ్ కి డబ్బులు ఇచ్చినట్టు ఒక ఇంటర్వ్యూలో నిర్మాత చెప్పుకొచ్చాడు. అలానే పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని అన్ స్టాపబుల్ అనే రియాల్టీ షోలో చెప్పాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు