OG : పవన్ కళ్యాణ్ కి అనుకూలంగానే అన్నీ ప్లాన్ చేస్తున్న మేకర్స్.. షూటింగ్ జరిగేది అక్కడే?

OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ “OG” సినిమాను సాహో ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మొదలైనప్పటినుండే ఓ రేంజ్ లో ఉంటుందని పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా, అన్నిటికంటే ఎక్కువగా OG కోసమే ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే అనూహ్యాంగా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం చేత అన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) భారీ మెజార్టీతో గెలవడం, ఏకంగా డిప్యూటీ సీఎం కూడా కావడం జరిగింది. ఇక సినిమాల్లో పవన్ రాక కోసమే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం వచ్చేసిందని ఓజి మేకర్స్ తాజాగా అనౌన్స్ చేసారు.

Pawan Kalyan's OG Movie Latest Shooting Update

 

- Advertisement -

సెట్స్ పైకి ఓజి రాక…

ఇక తాజాగా ఓజి మేకర్స్ సినిమా గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే ఓజి సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని మేకర్స్ పవన్ తో ఉన్న ఓ స్టిల్ షేర్ చేస్తూ ఈ విషయాన్నీ అనౌన్స్ చేసారు. ఇక పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ రెండో వారం నుండే ఓజి సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తాడని సమాచారం. ఇక సెట్స్ పై పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు మూడున్నాయి. కానీ ముందుగా ఓజి సెట్స్ లోకే పవన్ ఎంట్రీ ఇస్తున్నాడని కంఫర్మ్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్న బిజీ వల్ల ముంబై షెడ్యూల్, లేదా ఇతర దేశాల్లో ఏమైనా షెడ్యూల్స్ వేస్తె కుదిరే అవకాశం లేదు. అందుకే మేకర్స్ పవన్ కు అనుకూలంగానే షూట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

పవన్ కి అనుకూలంగానే ఓజి షూట్…

ఇక పవన్ కళ్యాణ్ ఓజి సెట్స్ లో వరుసగా పాల్గొనాలంటే రాజకీయాల్లో ఉన్న బిజీ వల్ల అన్ని చోట్ల తిరిగే అవకాశం లేకపోవచ్చు. అందుకే మేకర్స్ పవన్ కళ్యాణ్ కి అనుకూలమైన ప్రాంతాల్లోనే షూట్ చేయనున్నారట. ఓజి నెక్స్ట్ షెడ్యూల్ ని విజయవాడలోనే షూట్ ని ప్లాన్ చేస్తునట్టు సమాచారం. దాని తర్వాత కూడా వైజాగ్, పిఠాపురం సరిహద్దు ప్రాంతాల్లోనే షూట్ కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చు. ఇక ఓజి ఈ ఇయర్ వచ్చే అవకాశమైతే లేదు. బహుశా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి ఓజి ని ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇక ఓజి లో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka arul mohan) హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి అతి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రానున్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు