Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షాకింగ్ డేసిషన్, ఆందోళనలో అభిమానులు

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఎంతటి కీలకపాత్రను పోషించారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో జనసేన అనే పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. అయితే అప్పుడు రాష్ట్ర పరిస్థితులను బట్టి సీనియర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకి సపోర్టుగా నిలిచి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలకపాత్రను పోషించాడు. ఆ తర్వాత 2019 లో పవన్ కళ్యాణ్ సొంతంగా తన పార్టీ తరపున రెండు చోట్ల పోటీ చేశారు. అయితే పోటీ చేసిన రెండు చోట్ల కూడా తీవ్రమైన ఓటమిని చవిచూశాడు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan

ఇకపోతే పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాకలో ఓడిపోయిన తర్వాత చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ మీద తన ప్రశ్నల వర్షాన్ని సంధించాడు. అయితే అప్పటితో వైఎస్ఆర్సిపి పార్టీ పవన్ కళ్యాణ్ ని పర్సనల్ గా టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు బహిరంగ వేదికలపై మాట్లాడిన కూడా పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు దాటనివ్వమని, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పెళ్లిళ్ల గురించి మాట్లాడే వాళ్లు. అయితే వీటన్నిటికీ ఒక రోజు కచ్చితంగా సమాధానం చెప్తానంటూ పవన్ కళ్యాణ్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు.

- Advertisement -

ఇకపోతే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి సంచలమైన మార్పులు జరిగాయి మనందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టడానికి పవన్ కళ్యాణ్ వేసిన వ్యూహం అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో సీనియర్ నటుడు ఎన్టీఆర్ మాదిరిగా వారాహి అని ఒక వాహనంతో ప్రచారాన్ని జరిపారు. అది కూడా పవన్ కళ్యాణ్ కి బాగానే కలిసి వచ్చింది.

Pawan Kalyan-Varahi

 

అందుకే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజులపాటు దీక్ష చేస్తారు. ఇందులో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. అనే అధికారికంగా ప్రకటించారు. అయితే దీనిపై చాలామంది అభిమానులు స్పందిస్తూ డై నైట్ వర్క్ చేస్తారు ఇప్పుడు ఈ దీక్షలు అవసరమా అంటూ ఆందోళన చెందుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు