Pawan Kalyan : సమంత అపాయింట్‌మెంట్‌ను రిజెక్ట్ చేసిన పవన్… పవన్ ఇంకా అది గుర్తు పెట్టుకున్నాడా..?

Pawan Kalyan: సౌత్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తన అద్భుతమైన నటన, అందం, చలాకీతనంతో ఎన్నో సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. దాదాపు బడా హీరోలు అందరి సరసన నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది. ముఖ్యంగా సమంత అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక పవన్ కళ్యాణ్ తో తనకు చాలా మంచి బాండింగ్ ఉన్నట్లు సమంత చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత తనకు ఒక చిన్న సహాయం కావాలని పవన్ కళ్యాణ్ ను కోరిందట. అంతేకాకుండా అతని కలవాలని అపాయింట్మెంట్ అడిగిందట. అయితే సమంతకు ప్రకృతి అంటే ఎంత ఇష్టమో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సమంత ఎప్పుడూ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

పచ్చని చెట్లు, ప్రకృతి అన్నా సమంతకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక నేటి కాలంలో చాలామంది చెట్లను పెంచడం లేదు. అయితే చెట్లను పెంచడం వల్ల కలిగే లాభాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి సమంత పవన్ కళ్యాణ్ సాయం అడగాలని సమంత అనుకుందట. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉండడం వల్ల…. సమంత అపాయింట్మెంట్ ని రిజెక్ట్ చేశారట.

- Advertisement -

OG: Pawan Kalyan's sensational decision, producers should forgive me...

ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎవరిని కలిసేందుకు సమయం లేదని…. ఢిల్లీ టూర్లు, ఏపీ అసెంబ్లీ సమావేశాలు వరుసగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదట… అందువల్లనే సమంతకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న సమంత పవన్ కళ్యాణ్ కు సమయం దొరికినప్పుడే వెళ్లి కలుస్తానని చెప్పిందట. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు