Pawankalyan : మెగా డాటర్ ని మెచ్చుకున్న బాబాయ్.. ఇంతకన్నా బెస్ట్ విషెస్ ఏముంటుంది?

Pawankalyan : తెలుగు రాష్ట్రాల్లో పది రోజులుగా వర్షాలు, వరదలు ఊళ్ళని ముంచెత్తగా ఎన్నో లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నో వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా మరెన్నో వేల మూగజీవాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక తెలంగాణాలో కొన్ని రోజులు మాత్రమే ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ లో వరదల ఉతృత్తి ఇంకా తగ్గలేదు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిస్క్యూ చర్యలు చేపడుతుండగా, సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు తమ తరపున విరాళాలు అందచేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్స్ మొదలుకొని ఎంతో మంది పవన్ కళ్యాణ్ మహేష్ బాబు దాకా ఎంతో మంది స్టార్ హీరోలు భారీ విరాళాలు ప్రకటించారు. అంతే కాదు పలువురు దర్శక, నిర్మాతలు, టెక్నిషియన్స్, హీరోయిన్స్ కూడా విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలో మెగా డాటర్ నిహారిక (Niharika Konidela) కూడా 5 లక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

Pawankalyan praises Niharika Konidela

మెగా డాటర్ ని మెచ్చుకున్న బాబాయ్…

ఇక మెగా డాటర్ నిహారిక కొణిదెల రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ లో వరదల వల్ల నష్టపోయిన గ్రామాలలో తన వంతు సాయంగా, వరద వంపుకు గురైన ఓ 10 గ్రామాల్లో ఒక్కో గ్రామానికి 50,000 చొప్పున మొత్తంగా 5 లక్షలు విరాళంగా ప్రకటించింది. అయితే నిహారిక చేసిన చేసిన మంచి పనిని ప్రశంసిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నిహారికకు స్వయనా బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మెగా డాటర్ నిహారికనుప్రశంసిస్తూ, ట్వీట్ చేసారు. ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ పోస్ట్ చేస్తూ, ఈ విధంగా చెప్పుకొచ్చాడు.. “ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఒక్కొక్క గ్రామానికి 50 వేల రూపాయల చొప్పున 10 గ్రామాలకు రూ. 5 లక్షల విరాళం ప్రకటించిన అన్నయ్య నాగబాబు (Nagababu) గారి కుమార్తె, కొణిదెల నిహారికకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి సంకల్పంతో సాయం చేసేందుకు ముందుకు రావడం సంతోషాన్నిచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఇంతకంటే స్పెషల్ విష్ ఉంటుందా?

ఇక నిహారిక చేసిన మంచిపనిని మెచ్చుకుంటూనే, దాంతో పాటు నిహారిక రీసెంట్ గా నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమాని ప్రశంసిస్తూ అదే ట్వీట్ లో పోస్ట్ చేసారు. దాంట్లో.. “ఇటీవలే పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే “కమిటీ కుర్రాళ్ళు” (Committe Kurrollu) తో నిర్మాతగా విజయం సాధించిన నిహారిక మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని నిహారికను ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసారు. ఇక నిహారిక కి సినిమా పరంగా ఇంతకన్నా బెస్ట్ విషెస్ ఏముంటుందని కితాబిస్తున్నారు నెటిజన్లు. ఇక నిహారిక ప్రస్తుతం సినిమాల్లో నటించడం కన్నా, ఇప్పుడు నిర్మాతగా సినిమాలు తీయడానికే ఆసక్తి చూపుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు