BRO: పవన్ స్టైలిష్ లుక్ – అరాచకం ‘బ్రో’

పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ రోజుకొక అప్డేట్ తో అభిమానులను ఉత్సాహపరుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో తమిళ సినిమా వినోదాయ సీతాం కి రీమేక్ గా చేస్తున్న సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ తాజాగా విడుదల చేసింది సినిమా యూనిట్. స్టైలిష్ లుక్స్ తో వింటేజ్ పవర్ స్టార్ ని గుర్తు చేస్తున్న ఈ పోస్టర్ కి థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. శివుడి శ్లోకంతో సాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చుసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ తమ అంచనాలకు మించి ఈ పోస్టర్ ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ముందుగా ఊహించినట్టుగానే ‘బ్రో’ టైటిల్ ని ఖరారు చేశారు. జులై 28న విడుదలకి సిద్దమవుతున్న ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే, ఈ పోస్టర్లో సాయిధరమ్ తేజ్ లేకపోవటం మెగా అభిమానులను ఒకింత నిరాశకు గురి చేస్తోంది. వాస్తవానికి రీమేక్ సినిమానే అయినప్పటికీ, ఇందులో చాలా మార్పులు చేసినట్లు అర్థమవుతోంది ఫస్ట్ లుక్ చూస్తుంటే.

ఇటీవలే విరుపాక్షతో హిట్ అందుకొని ఊపు మీదున్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ తరహా పాత్రలో నటించటం పవన్ కళ్యాణ్ కి ఇది రెండోసారి, గతంలో వెంకటేష్ తో కలిసి గోపాల గోపాల సినిమాలో మాడరన్ దేవుడి గెటప్ లో కనిపించి అలరించాడు. మరి, పవన్ లైనప్ లో ఉన్న సినిమాల్లో మొదట రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు