Payal Ghosh: క్రికెటర్ కారణంగా 9 ఏళ్లు సె**క్స్ కు దూరంగా ఎన్టీఆర్ హీరోయిన్..!

Payal Ghosh: తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన పాయల్ ఘోష్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది.. ఆ తర్వాత హిందీలో పలు సినిమాలు చేసింది. అయితే ఈమె అసలు పేరు హారిక..  సినిమాల్లోకి వచ్చిన తర్వాతనే తన పేరు పాయల్ ఘోష్ గా మార్చేసుకుంది.  తెలుగు,  కన్నడ , హిందీ, తమిళ్ భాషల్లో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె..  ఏమైందో తెలియదు కానీ గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందని చెప్పవచ్చు.. ఇక ప్రస్తుతం వివాదాస్పద వార్తలతో వైరల్ గా మారుతోంది.

ఇర్ఫాన్ తో డేటింగ్..

Payal Ghosh: NTR heroine away from sex for 9 years because of cricketer..!
Payal Ghosh: NTR heroine away from sex for 9 years because of cricketer..!
గత కొన్ని రోజులుగా ఈమె పేరు చాలా కాంట్రివర్సిలలో వినిపించిందని చెప్పవచ్చు.. స్టార్ హీరోలు హీరోయిన్ల పై కాంట్రవర్సీ గా కామెంట్లు చేస్తూ తెగ ట్రెండ్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.. నిజానికి గతంలో ప్రభాస్ సలార్ సినిమాపై కామెంట్స్ చేసి అభిమానుల చేత ట్రోల్ కి గురైన పాయల్ ఘోష్ ఇప్పుడు ఒక స్టార్ క్రికెటర్ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది.. పాయల్ ఘోష్ మాట్లాడుతూ.. ఒక క్రికెటర్ తనను అత్యంత దారుణంగా మోసం చేశాడు అని షాక్ ఇచ్చింది.. ఆ క్రికెటర్ ఎవరో కాదు ప్రముఖ స్టార్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. అతడితో ఐదేళ్లు డేటింగ్ చేశానని చెప్పిన ఈమె.. అలాగే గౌతమ్ గంభీర్ పై కూడా కొన్ని సంచలన కామెంట్లు చేసింది..

పఠాన్ తో చివరిసారి శృంగారంలో పాల్గొన్న..

పాయల్ ఘోష్ మాట్లాడుతూ.. గౌతమ్ గంభీర్ ఎప్పుడూ మిస్డ్ కాల్ ఇచ్చేవాడు అంటూ తన ఇంస్టాగ్రామ్ లో రాసుకుంది. ఇర్ఫాన్ పఠాన్ తో బ్రేకప్ అయ్యాక తొమ్మిది సంవత్సరాలుగా నేను ఎవరితో కూడా శృంగారంలో పాల్గొనలేదు.. ఇది నిజం.. ఆ తర్వాత నాతో ఒక వ్యక్తి శృంగారం చేయడానికి ట్రై చేశాడు.. కానీ దాని పట్ల గౌరవం ఉంది.. ఎవరితో పడితే వారితో నేను శృంగారం చేయలేను అంటూ తన ఇన్స్టాలో పోస్ట్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. అలాగే ఇంకొన్ని పోస్ట్లు కూడా షేర్ చేయడంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఇర్ఫాన్ నన్ను మోసం చేశాడు..

అలాగే 2016లో ఒకసారి ఇర్ఫాన్ ఇంటికి వెళ్లాను.. మా ఫ్యామిలీ కూడా నన్ను యాక్సెప్ట్ చేయడం లేదు అని చెప్పాడు.. అప్పటినుంచి మా మధ్య గ్యాప్ వచ్చింది.. ఆ తర్వాత అతని సిస్టర్ ఫోన్ చేసి ఇర్ఫాన్ కి పెళ్లి కాబోతోంది అని చెప్పింది. అలాగే మా నాన్నకు ముసల్మాన్ అంటే ఇష్టం ఉండదు.. కానీ నేనెప్పుడూ అతనికి మద్దతు గానే నిలిచాను.. నేను ఎప్పుడూ చీట్ చేయలేదు.. నా పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి అంటూ రాసుకుంది పాయల్.. ఇక పాయల్ చేసిన ఈ పోస్ట్ కి కొంత మంది మద్దతు పలుకుతుంటే… మరి కొంతమంది ఘోరంగా కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ మళ్ళీ వార్తల్లో నిలిచిందని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు