Payal Rajput : నన్ను డబ్బుల కోసం నిర్మాతలు బాగా వాడుకున్నారు… పాయల్ సంచలన కామెంట్స్ వైరల్

Payal Rajput: తెలుగు చిత్ర పరిశ్రమలు ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది ఎక్స్పోజింగ్ నమ్ముకుంటే… మరి కొంతమంది హీరోయిన్ చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తారు. ఏమాత్రం తమ అంద చెందాలను ఆరబోయకుండా కూడా ఎన్నో సక్సెస్ సినిమాలు అందుకున్నారు. కానీ కొంతమంది అవకాశం వస్తే చాలు ఎక్స్పోజింగ్ చేసేందుకు రెడీగా ఉంటారు. అలాంటి హీరోయిన్లలో పాయల్ రాజ్ పుత్ ఒకరు. హీరోయిన్ పాయల్.. అంటేనే హాట్ సీన్స్ గుర్తుకు వస్తాయి.

దీనికి ప్రత్యేక ఉదాహరణ ఆర్ఎక్స్ 100 సినిమా. ఆర్ఎక్స్ 100 సినిమా సక్సెస్ కావడానికి పాయల్ ఎక్స్పోజింగ్… రొమాంటిక్ సీన్స్ కారణమని ఇప్పటికీ అందరూ చెబుతూ ఉంటారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక రేంజ్ హీరోయిన్గా మారిపోయింది. అయితే తాజాగా… హీరోయిన్ పాయల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. తను డబ్బుల కోసం వాడుకున్నారని ఆరోపణలు చేసింది పాయల్.

2019 సంవత్సరంలో రక్షణ అనే సినిమాలో తాను నటించినట్లు తెలిపారు పాయల్. నా రీసెంట్ సక్సెస్ చూసి ఇప్పుడు రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు అని ఆమె తెలిపింది. అగ్రిమెంట్ ప్రకారం నా రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ఫైర్ అయింది. ప్రమోషన్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు… ఒకవేళ తాను రాకపోతే బ్యాన్ చేస్తామంటున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఈ సినిమాలో తన పేరు అలాగే పాత్ర ఉంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది పాయల్.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు