Payal Rajput: పెళ్లికి రెడీ అయిన హాట్‌ బ్యూటీ !

Payal Rajput: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కొంతమంది ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా హీరోయిన్గా రాణిస్తుంటే…. మరికొందరేమో ఎక్స్పోజింగ్ నమ్ముకొని ఫేమస్ అయిన హీరోయిన్లు ఉన్నారు. అలాంటి వారిలో పాయల్ రాజ్ పుత్ ఒకరు. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమాలో హీరో కార్తికేయ సరసన హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఈ అమ్మడు ఆరబోసిన అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా బోల్డ్ సీన్లలో కూడా నటించి యూత్ ను ఆకట్టుకుంది. ఇక తన నటనకు కుర్ర కారు అంతా ఫిదా అయిపోయారు. ఆ సినిమా అనంతరం వెంకీ మామ, డిస్కో రాజా వంటి పెద్ద పెద్ద చిత్రాలలో అవకాశాలను అందుకుంది.

స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక పాయల్ స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు రాలేదు. వరుస ఓటమిలను చవిచూసింది. ఇక ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీకి అవకాశాలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కోలీవుడ్ స్టార్ హీరోతో ఈ బ్యూటీ చాలా క్లోజ్ గా ఉంటుందంటూ అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా…. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది.

- Advertisement -

ఈ ఫోటోల్లో ఎప్పుడూ లేని విధంగా రెడ్ కలర్ డ్రెస్ ధరించి…. అచ్చం పెళ్లి కూతురిలా ముస్తాబు అయింది. ఇక ఈ ఫోటోలు చూసిన చాలా మంది పెళ్లి చేసుకుంటుందేమో అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏదో సినిమా షూటింగ్ కోసం పెళ్లికూతురిలా రెడీ అయ్యిందని…. తన ముందు ఉన్న స్క్రిప్ట్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు