Payal Rajput: పాయల్ చేసిన ఆరోపణలకు క్లారిటీ ఇచ్చిన TFPC..!

Payal Rajput.. ఆర్ఎక్స్ 100 సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని ఇప్పుడు మంగళవారం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయిన పాయల్ రాజ్ పుత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది..అదేమిటంటే రక్షణ అనే సినిమాను తాను నాలుగేళ్ల క్రితం చేశానని.. ఇప్పుడు తనకు వచ్చిన సక్సెస్ క్యాష్ చేసుకోవడానికి.. ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారని.. తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ పూర్తిగా క్లియర్ చేయలేదని.. పైగా ప్రమోషనల్ కార్యక్రమాలకు రావాలని డిమాండ్ చేస్తున్నారని… రాకపోతే తెలుగు సినిమా నుంచి తనను బ్యాన్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.. అంతేకాదు రక్షణ చిత్ర బృందం వాడిన భాష వ్యవహరించిన తీరు ఏం బాగాలేదని తనకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించింది కూడా దీంతో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక లేఖ విడుదల చేసింది..

పాయల్ పైన రక్షణ చిత్ర బృందం కంప్లైంట్..

Payal Rajput: TFPC has given clarity to Payal's allegations..!
Payal Rajput: TFPC has given clarity to Payal’s allegations..!

మార్చి 28వ తేదీన పాయల్ రాజ్ పుత్ పై రక్షణ దర్శక నిర్మాత రణదీప్ ఠాకోర్ కంప్లైంట్ ఇచ్చారని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఈరోజు తెలిపింది .. ప్రచార కార్యక్రమాలకు సహకరించడం లేదని.. పైగా నాలుగేళ్ల క్రితం తీసిన సినిమా నేరుగా ఓటీటీ లో విడుదల చేయాలని ఆమె సలహా ఇచ్చినట్టు ప్రణదీప్ తెలిపినట్టు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వెల్లడించింది.. తన పేమెంట్ క్లియర్ చేయలేదని పాయల్ చేసిన ఆరోపణ మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ స్పందిస్తూ.. దర్శక నిర్మాతలతో ఆమెకు జరిగిన అగ్రిమెంట్ ప్రకారం 50 రోజులు షూటింగ్ చేయాలని… అగ్రిమెంట్లో 16వ క్లాజు ప్రకారం సినిమా గనుక వాయిదా పడినా లేక ముందుగానే రిలీజ్ అయిన ఆమె చిత్రీకరణ పూర్తి చేయాలని.. 17వ క్లాజు ప్రకారం చిత్రీకరణ చేసిన 50 రోజులు కాకుండా మరో కొన్ని రోజులు ప్రింట్ , డిజిటల్, సోషల్ మీడియా ప్రచార కార్యక్రమాలకు కేటాయించాలని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలిపింది.. ఇక అందులో భాగంగానే ఏప్రిల్ 19న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారని.. పబ్లిసిటీ ప్రోగ్రాం లో పార్టిసిపెంట్ చేస్తే పాయల్ పారితోషకంతో బ్యాలెన్స్ మిగిలిన రూ .6లక్షల కూడా ఇవ్వడానికి దర్శకనిర్మాత ప్రణదీప్ ఠాకూర్ ముందుకు వచ్చారని నిర్మాతలు మండలి తెలిపింది.. ఏప్రిల్ 4వ తేదీన చెక్ కూడా ఇచ్చామని.. కానీ ఆమె పబ్లిసిటీ ప్రమోషనల్ కి రాకపోవడం వల్ల తనకు ఆర్థికంగా నష్టం కలిగిందని ప్రణదీప్ చెప్పుకొచ్చారు..

దురుద్దేశ్యపూర్వకంగానే పాయల్ పోస్ట్ వదిలిందా..

ఇక ఏప్రిల్ నాలుగో తేదీన పాయల్ మేనేజర్ సౌరబ్ దింగ్రా కు చెందిన ఫోన్ చేస్తే 12న మీటింగ్ కి వస్తామని చెప్పారు.. మళ్ళీ అదే రోజు సాయంత్రం ఫోన్ చేస్తే నాలుగేళ్ల క్రితం సినిమా కనుక పాయల్ ప్రమోషన్స్ చేయదు అని చెప్పాడు అని TFPC స్పష్టం చేసింది.. అతనికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తే సానుకూలంగా స్పందించలేదని ప్రణదీప్ ఠాకూర్ తమకు తెలిపినట్టు టీఎఫ్ పిసి స్పష్టం చేసింది.. ఇంతలో సోషల్ మీడియాలో పాయల్ చేసిన పోస్ట్ తమ దృష్టికి వచ్చిందని కూడా వివరించింది. పాయల్ సమస్యను తప్పుదోవ పట్టించేలా దురుద్దేశ్యపూర్వకంగానే పోస్ట్ చేసిందని.. గత నెలన్నరగా సమస్యను సాల్వ్ చెయ్యాలని తాము ప్రయత్నించినా.. అన్నీ వృధా అయిపోయాయని టిఎఫ్పిసి తెలిపింది.. అంతేకాదు తమ దృష్టికి ఎప్పుడు సమస్య వచ్చినా . ఆ సమస్యలను ఇరువురి మధ్య పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తుందని లేఖను ముగించింది . మరి ఈ లేఖపై పాయల్ రాజ్ పుత్ ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు