PekaMedalu : చిన్న సినిమా పెద్ద ఆలోచన… అతి తక్కువ ధరకే టికెట్

PekaMedalu : టాలీవుడ్ లో గత కొంత కాలంగా పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే మంచి సక్సెస్ అవుతున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో మంచి సినిమాలు తీస్తూ, చిన్న సినిమాలుగా రిలీజ్ అయి పెద్ద సక్సెస్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ బలగం, ఈ ఇయర్ హనుమాన్ వంటి సినిమాలు చరిత్ర సృష్టించాయి. అయితే చిన్న సినిమాలకు రిలీజ్ కి ముందు మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. థియేటర్ల సమస్య ఉన్న సమస్య అయితే, ప్రమోషన్ల సమస్య కూడా ఒకటుంది. కొన్ని సినిమాలు మంచి కథాంశంతో వచ్చినా వాటికి తగ్గ ప్రమోషన్లు మేకర్స్ చేయలేకపోవడం వల్ల జనాల్లోకి రీచ్ అయ్యేలోపు థియేటర్లోంచి వెళ్లిపోతున్నాయి. అది గుర్తించిన నిర్మాతలు ఇప్పుడు చిన్న సినిమాలకు కూడా డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్నారు.

PekaMedalu Movie Paid Premiors Ticket Cost just 50rs

చిన్న సినిమాకు మంచి ప్రమోషన్లు..

లేటెస్ట్ గా ఓ చిన్న సినిమాకు మేకర్స్ అదిరిపోయే ప్రమోషన్లు చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ వారం అనగా జులై 19న ‘పేకమేడలు’ (PekaMedalu) అనే చిన్న సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే. దీనికి పోటీగా ప్రియదర్శి డార్లింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్లలో జోరు పెంచి, కాస్త డిఫరెంట్ గా పేకమేడలు సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. పైగా రిలీజ్ కి కూడా మరో మూడు రోజులే ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ టూర్లు వేస్తున్నారు. ముందుగా వైజాగ్ తో మొదలు పెట్టి, విజయవాడ ఆ తర్వాత ఫైనల్ గా హైదరాబాద్ లో ప్రత్యేక పెయిడ్ ప్రీమియర్ షో లు వేస్తున్నారు. నేటి నుండి 18వరకు ఈ ప్రీమియర్స్ ఉంటాయని సమాచారం. అయితే దీంట్లో భాగంగా ఓ సాలిడ్ ఆఫర్ కూడా ప్రకటించారు మేకర్స్.

- Advertisement -

అతి తక్కువ ధరకే పేకమేడలు మూవీ టికెట్..

ఇక పేకమేడలు సినిమాకి సంబంధించి మేకర్స్ అతి తక్కువ ధరకే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నామని అనౌన్స్ చేసారు. ఈ సినిమా ప్రీమియర్స్ వేస్తున్న థియేటర్లలో 150 రూపాయల టికెట్ ని కేవలం 50 రూపాయలకే అమ్ముతున్నారట. ఇది కేవలం ప్రీమియర్స్ కే అని సమాచారం. మూవీ లవర్స్ ఖచ్చితంగా ఈ రేటుకి భారీగా థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉంది. కంటెంట్ ఎలా ఉంటుందో అన్న మాట పక్కనబెడితే జనాలు ఇంత తక్కువ రేటు ఉండడం వల్ల ముందు ప్రీమియర్స్ కి యూత్ ఆడియన్స్ బాగా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా మేకర్స్ సక్సెస్ అయినట్టే. మౌత్ టాక్ రిలీజ్ అయ్యేలోపు స్ప్రెడ్ అయిపోతుంది. ఇక పేకమేడలు సినిమాలో నా పేరు శివ, గ్యాంగ్స్ అఫ్ గోదావరి వంటి సినిమాల్లో విలన్ గా నటించిన వినోత్ కిషన్ ఈ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. మరి ప్రీమియర్స్ తో ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు