People media factory : ఒక పక్క డిజాస్టర్ లు , మరో పక్క సెలబ్రేషన్స్

People media factory : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. వాటిలో టక్కున వినిపించే పేర్లు హారిక హాసిని క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి ఎన్నో సినిమాలను నిర్మించే సంస్థలు ఉన్నాయి. వీటన్నిటిలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రత్యేకమని చెప్పాలి. ఈ నిర్మాణ సంస్థకు సంబంధించి చాలా మంది దగ్గర అడ్వాన్సులు ఉన్నాయి. ఈ నిర్మాణ సంస్థ ఇప్పటికే దాదాపు 40 సినిమాలను దాటి నిర్మించింది. 100 సినిమాలను తీయాలని ఉద్దేశ్యంతో టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీని స్థాపించినట్లు ఇదివరకే చాలాసార్లు చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పటివరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇది రిలీజ్ అయిన సినిమాలలో సక్సెస్ రేట్ గురించి మాట్లాడితే కేవలం ఐదు నుంచి పది సినిమాలు మాత్రమే వినిపిస్తాయి. మిగతా సినిమాలన్నీ కూడా అంతంత మాత్రమే ఆడాయి. ఒక దర్శకుడికి కావాల్సిన సదుపాయాలు ఇవ్వడం, సినిమాకు కావలసిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం వంటి క్వాలిటీస్ ఈ నిర్మాణ సంస్థకు ఉన్నాయి. ఎంత ఖర్చు పెట్టినా కూడా సినిమాలో క్వాలిటీ లేకపోతే అదంతా వృధాగా మారిపోతుంది.

Karthikeya 2

- Advertisement -

 

ఇక రీసెంట్ గా ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తో కొనసాగుతుంది. మొదటి ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది ఆ తర్వాత మెల్లమెల్లగా నెగిటివ్ టాక్ కూడా మొదలైంది. ఎక్కువగా ఈ సంస్థలో డిజాస్టర్ సినిమాలే వస్తున్నాయి. ఈ తరుణంలో ఈ సంస్థ నుంచి వచ్చిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయింది. రీసెంట్గా అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమాకి సంబంధించి చిత్ర యూనిట్ అంతా కలిసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇలా సెలబ్రేషన్స్ జరుపుకోవడం తప్పులేదు. కానీ ఒకవైపు డిజాస్టర్ సినిమాలు అన్ని పెట్టుకొని ఒక సినిమాకి ఇంత హడావిడి చేయడం ఏంటి అనేది కొంతమంది అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు