Sudheer Babu : తొలి సారి పిరియాడిక‌ల్‌..

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం పిరియాడిక్ సినిమాల ట్రెండింగ్ కొన‌సాగుతోంది. త‌న కెరీర్‌లో తొలిసారి పిరియాడిక‌ల్ మూవీకి సుధీర్ బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. సుధీర్ బాబు హీరోగా న‌టిస్తున్న 18వ సినిమాను తాజాగా అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి సెహ‌రి ఫేమ్ జ్ఞాన సాగ‌ర్ ద్వార‌క ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. 1989 లో కుప్పం బ్యాక్ డ్రాప్లో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ అంశాల‌కు భ‌క్తిని మేళ‌వించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. ఇన్‌లాండ్ లెట‌ర్‌పై సుబ్ర‌హ్మ‌ణ్యం కుప్పం అనే అడ్ర‌స్ రాసి ఉండ‌డం, క్రిటిక‌ల్ నువ్వు ఇక్క‌డికి అత్య‌వ‌స‌రమంటూ రాసిన క్యాప్ష‌న్ ఆసక్తినికి రేకెత్తిస్తోంది. టెంపుల్ బొమ్మ‌తో పాటు గ‌న్‌, బుల్లెట్స్‌, పాత వంద రూపాయ‌ల నోటు ఈ లెట‌ర్‌పై క‌నిపిస్తున్నాయి. “పిలిసినంక రాకుంటే ఎట్ల సెప్పండ అందికే వస్తా ఉండా” అని సుధీర్ బాబు ట్విట్ట‌ర్‌లో రాసి ఉండ‌డం విశేషం. అక్టోబ‌ర్ 31న ఈ చిత్రానికి సంబంధించిన మాస్ అప్‌డేట్‌ని రివీల్ చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

సుధీర్ బాబు ఈ సినిమాలో పూర్తి స్థాయి మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్యారెక్ట‌ర్ కోసం అత‌ను స్పెష‌ల్ గా మేకోవ‌ర్ అవుతున్న‌ట్టు చెబుతున్నారు. ఇటీవ‌లే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు సుధీర్ బాబు. ప్ర‌స్తుతం ‘ది హంట్’ సినిమాతో పాటు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ‘మామామ‌శ్చీంద్ర’ అనే సినిమా చేస్తున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు