Pic of The Decade : చిరుతో అజిత్… అప్పుడలా, ఇప్పుడిలా

Pic of The Decade : తాజాగా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్ స్టార్ తల అజిత్ కలిసి దిగిన ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ ఫోటోలను గతంలోని మరో ఫోటోతో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. మరి అప్పటికీ ఇప్పటికీ ఈ ఇద్దరు హీరోలలో వచ్చిన మార్పులు ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే….

పిక్ ఆఫ్ ది డెకేడ్

ఇద్దరు మాస్ హీరోలు ఒకే చోట కనిపిస్తే షేక్ హ్యాండ్ లేదా హగ్ తో సరి పెట్టేస్తారు. కానీ చిరంజీవి, అజిత్ మాత్రం చాలా డిఫరెంట్. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసినా ఆ మెమొరీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఫోటోలు దిగుతారు. ఎన్నో ఏళ్ల క్రితం ఇదే జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఇద్దరు హీరోలు తమ మెమొరీని సేఫ్ గా దాచుకునే పని చేశారు. అలాగే తాజాగా వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతుంది. అందులో అజిత్ ఎప్పటిలాగే తన ఏజ్ కి తగ్గ లుక్ తో బ్లాక్ కలర్ రెగ్యులర్ చెక్స్ ఉన్న షర్ట్ వేసుకొని కనిపించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన బ్లాక్ కలర్ షర్ట్ లో ఎప్పటిలాగే గ్రేస్ ఫుల్ గా దర్శనమిచ్చారు. గతంలో కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి దిగిన ఫోటోను తాజా ఫోటోతో కంపేర్ చేస్తున్నారు నెటిజెన్లు.

Image

- Advertisement -

కెరీర్ మొదట్లో అజిత్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిన ఫోటోను మరోసారి వైరల్ చేస్తున్నారు. పాత ఫోటోలో చిరంజీవి అజిత్ ను దగ్గరగా పట్టుకోగా, ఆయన చేతులు కట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కనిపించడంతో ఇరువురు హీరోల అభిమానులు ఫుల్ దిల్ ఖుష్ అవుతున్నారు.

చిరు, అజిత్ ఎందుకు కలిశారు ?

ఇక ఈ ఫోటోలు చూడగానే అందరికీ వచ్చే డౌట్ ఒక్కటే. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే చోట ఎందుకు చేరారు ? దీనికి సమాధానం ఏమిటంటే సినిమా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా ఫాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ విశ్వంభర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన తాజా షెడ్యూల్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటున్నారు. మరోవైపు అజిత్ కూడా తన కొత్త మూవీ గుడ్ బాడ్ అగ్లీ షూటింగ్ కోసం రీసెంట్ గా హైదరాబాద్ కు వచ్చారు.

Image

ఇద్దరు స్టార్ హీరోల షూటింగ్ లు ఒకే చోట జరుగుతుండడంతో ఇటు చిరు, అటు అజిత్ ఒకరినొకరు కలసి మాట్లాడుకున్నారు. పనిలో పనిగా ఇద్దరూ కలిసి ఒక ఫోటో దిగారు. చాలాకాలం తర్వాత ఇద్దరు కలిసి ఒకే సెట్ లో కనిపించడంతో ఒకరి గురించి ఒకరు పలు ఆసక్తికరమైన విషయాలను మాట్లాడుకున్నారు. అప్పటికి ఇప్పటికీ ఏం మారింది అంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పేరు ముందు పద్మ విభూషణ్ చేరింది. దీంతో అజిత్ చిరుకు శుభాకాంక్షలు తెలిపినట్టు సమాచారం. కాగా రీసెంట్ గా అజిత్ హైదరాబాదులో బైక్ రైడ్ చేస్తూ కేవలం కంటికి చిక్కిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు