Polimera 2 : ఫిల్మ్ ఛాంబర్ నుంచి బెదిరింపులు… దిల్ రాజు చెంతకు పొలిమేర వివాదం

Polimera 2 : బ్లాక్ బస్టర్ బ్లాక్ మ్యాజిక్ కథతో తెరకెక్కిన పొలిమేర 2 వివాదం రోజురోజుకూ మరింతగా ముదురుతోంది. ఇప్పటికే పోలిమేర 2 మూవీ నిర్మాత పొలిమేర 3 నిర్మాతపై పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. మూవీ లాభాల్లో వాటా అడిగినందుకే తనను చంపేస్తానని బెదిరిస్తున్నారు అంటూ పొలిమేర 2 నిర్మాత గౌరీ కృష్ణ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ వివాదం దిల్ రాజు చెంతకు చేరింది.

దిల్ రాజుకు నిర్మాత గౌరీ కృష్ణ లేఖ…

ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఉన్న బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుకు నిర్మాత గౌరీ కృష్ణ తాజాగా కంప్లైంట్ చేస్తూ ఓ లేఖను రాశారు. అందులో గౌరీ కృష్ణ తను నిర్మించిన పొలిమేర 2 మూవీ లాభాల్లో వాటాను అడిగినందుకే చంపేస్తానని బెదిరించిన నిర్మాత నందిపాటి వంశీ గురించి ప్రస్తావించారు. ఆయనపై గత ఏడాది నవంబర్ 27న కంప్లైంట్ చేశానని, దానిని పరిశీలించాలంటూ దిల్ రాజుకు రిక్వెస్ట్ చేశారు. ఇక ఆ లేఖలో ఫిలిం ఛాంబర్ కి చెందిన ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ ఈ గొడవలో కలగజేసుకొని చాంబర్ తరఫున తనను బెదిరించే ప్రయత్నం చేశాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవర్ ను మిస్ యూజ్ చేస్తూ కొన్ని డాక్యుమెంట్ల మీద తనను సంతకం చేయాలని బెదిరిస్తున్నారు అంటూ ప్రసన్న కుమార్ పై గౌరీ కృష్ణ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క నందిపాటి వంశీ కూడా తనను చంపేస్తానని బెదిరిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Polimera 2 Producer Write Letter to Dil Raju Over Clash with Vamsi Krishna Polimera 2 Controversy: ముదురుతున్న 'పొలిమేర 2' వివాదం - న్యాయం చేయాలంటూ దిల్‌ రాజుకు నిర్మాత లేఖ!

- Advertisement -

అసలు వివాదం ఏమిటంటే…

బ్లాక్ బస్టర్ మూవీ పోలిమేరకు సీక్వెల్ గా పోలిమేర 2 మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ కు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను వంశీ నందిపాటి అడ్వాన్స్ బేసిస్ మీద సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ వివరాలు చెప్పకపోవడమే కాకుండా, అందులో వచ్చిన లాభాల్లో ఒక్క రూపాయి కూడా నిర్మాత గౌరీ కృష్ణకి ఇవ్వలేదు. పైగా ఆ సినిమాను రిలీజ్ చేసేటప్పుడు ఆయన దగ్గర అడ్వాన్స్ ఇచ్చి బ్లాంక్ చెక్కులు, సంతకం చేసిన బ్లాంక్ లెటర్లు, బ్లాంక్ బాండ్ పేపర్లు సెక్యూరిటీ పేరుతో తీసుకున్నారంటూ ఈ నిర్మాత ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వాటిని ఆయుధాలుగా మార్చుకొని తనను బెదిరిస్తున్నారు అంటూ దిల్ రాజు దగ్గర మొరపెట్టుకున్నాడు. అంతేకాకుండా పొలిమేర 3 మూవీని తనకు చెప్పకుండానే అనౌన్స్ చేశారని, అది పొలిమేర 2 నిర్మాతగా తనకున్న హక్కులను ధిక్కరించడమే అవుతుందని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా ఈ విషయంలో ఛాంబర్ కలగజేసుకొని తనకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా గౌరీ కృష్ణ కోరారు. పొలిమేర 3లో పొలిమేర 2కు సంబంధించిన కంటెంట్ ను వాడకుండా చూడాలని ఆ లేఖలో రాసుకొచ్చారు. ఈ విషయంపై దిల్ రాజు ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు