Polimera 3 : చంపుతామని బెదిరిస్తున్నారు… పొలిమేర 3 నిర్మాతపై పొలిమేర 2 నిర్మాత కంప్లైంట్

Polimera 3 : బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన పొలిమేర మూవీ ఇప్పటికే రెండు భాగాలు రిలీజ్ అయి సూపర్ సక్సెస్ గా నిలిచిన విషయం తెలిసిందే. 2021 లో తెరపైకి వచ్చిన పొలిమేర మూవీ అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చేతబడి కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీ ట్రెండింగ్ కాన్సెప్ట్ గా మారింది. ఈ సినిమాలో సత్యం రాజేష్ హీరోగా నటించారు. ఈ నేపథ్యంలోనే పొలిమేర 3 రూపుదిద్దుకుంటుంది. అయితే అంతలోనే పొలిమేర 3 నిర్మాతపై పొలిమేర 2 నిర్మాత ఇచ్చిన కంప్లైంట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది.

చంపుతామని బెదిరిస్తున్నారు…

అసలు విషయం ఏమిటంటే ఫ్రాంచైజీ అంటే ఇబ్బందులు కామన్. నిర్మాతల మధ్య లేదా డైరెక్టర్స్ మధ్య వచ్చే విభేదాలు అందుకు కారణం అవుతాయి. తాజాగా పొలిమేర 3 విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ప్రొడ్యూసర్ వంశీ నందిపాటికి న్యాయపరమైన చిక్కులు మొదలయ్యాయి. ఈ నిర్మాత గీత ఆర్ట్స్ బన్నీ వాస్ కు క్లోజ్ ఫ్రెండ్. తాజాగా పొలిమేర 3 మూవీని నిర్మించడానికి ముందుకొచ్చిన వంశీ నందిపాటికి సమస్యలు మొదలయ్యాయి. అనిల్ విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిమేర 2 మూవీ ని నిర్మాత కృష్ణ ప్రసాద్ నిర్మించారు. అయితే ఆ మూవీకి వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూటర్ గా ఉంటూ మూవీని రిలీజ్ చేశారు. మొదటి రెండు పార్ట్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పొలిమేర 3 మూవీని స్వయంగా తానే నిర్మిస్తానని వంశీ ప్రకటించాడు.

అది కూడా సదాసీదాగా కాదు భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తానని ప్రకటించారు. అక్కడే మొదలైంది అసలు గొడవ. పొలిమేర 2ను డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు వంశీ నందిపాటికి డిస్ట్రిబ్యూటర్ గా చాలా లాభాలు వచ్చాయని, అయితే ఆ సినిమాకు తాను నిర్మాత కాబట్టి తనకు కూడా లాభాల్లో వాటా ఇవ్వమని అడగగా, వంశీ తనను బెదిరించాడు అంటూ మరో నిర్మాత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు.

- Advertisement -

Polimera 3 producer takes on Polimera 2 | cinejosh.com

వంశీ నందిపాటిపై కృష్ణ ప్రసాద్ కంప్లైంట్…

ఈ నేపథ్యంలోనే పొలిమేర 3 నిర్మాత అయిన వంశీ నందిపాటిపై పొలిమేర 2 నిర్మాత కృష్ణ ప్రసాద్ లీగల్ యాక్షన్ కు రెడీ అయ్యారు. అందులో భాగంగానే ఆయనపై కంప్లైంట్ ఫైల్ చేశారు. అందులో పొలిమేర 2 సినిమాకు 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని, ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసిన వంశీ నందిపాటి ఇప్పటిదాకా తనకు లాభాల్లో పైసా కూడా ఇవ్వలేదని వెల్లడించారు. అలాగే తన షేర్ తనకు కావాలని అడిగితే చంపేస్తానని బెదిరించారు అంటూ షాకింగ్ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఒకవేళ తనపై కంప్లైంట్ ఫైల్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపెట్టారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు కృష్ణ ప్రసాద్. ఈ నేపథ్యంలోనే తనకు పర్సనల్ సెక్యూరిటీ కావాలని రిక్వెస్ట్ చేశారు. మరి ఈ వివాదం నేపథ్యంలో పొలిమేర 3 మూవీ ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ అవుతుందా ? లేక ఆగిపోతుందా? అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు