Polimera 3: భయపెడుతున్న పొలిమేర 3.. గ్లింప్స్ వైరల్..!

Polimera 3: ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటూ మరొకసారి భయపెట్టడానికి సిద్ధం అయ్యింది పొలిమేర 3.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది అంటూ ఒక చిన్న గ్లింప్ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్.. తాజాగా షేర్ చేసిన గ్లింప్ చూస్తుంటే పొలిమేర ,పొలిమేర 2 సినిమాలకు మించి ఇది ఉండబోతుందని స్పష్టమవుతుంది.. గుడి, చేతబడి అంటూ మరొకసారి అందరిని ఆలోచింప చేయడమే కాదు భయపెట్టడానికి కూడా సిద్ధం కండి అంటూ గ్లింప్ షేర్ చేశారు.. ప్రస్తుతం ఇది చాలా వైరల్ గా మారుతోంది. పొలిమేర , పొలిమేర 2 చూసిన తర్వాత పొలిమేర 3 కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. త్వరలోనే సినిమా తెరపైకి రాబోతోందని చెప్పడంలో సందేహం లేదు.

Polimera 3: Scary Polimera 3.. Glimpses Viral..!
Polimera 3: Scary Polimera 3.. Glimpses Viral..!

పొలిమేర, పొలిమేర 2..

ఇక అసలు విషయంలోకి వెళితే 2021లో నేరుగా ఓటీటీ లోకి వచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది మా ఊరి పొలిమేర సినిమా.. దానికి సీక్వెల్ గా మా ఊరి పొలిమేర 2 కూడా వచ్చేసింది. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరీ కృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకుడిగా పనిచేశారు.. సత్యం రాజేష్ , కామాక్షి భాస్కర్ల, రాకెండ్ మౌళి , గెటప్ శ్రీను, బాలాదిత్య , రవి వర్మ , సాహితీ దాసరి , చిత్రం శ్రీను, అక్షతా శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.. ఇకపోతే మా ఊరి మేర చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చిన నిర్మాతలు దాని సీక్వెల్ గా వచ్చిన మా ఊరి పొలిమేర టు చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ , ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతం గా ఆకట్టుకున్నాయి.. మొదటి భాగం కంటే రెండో భాగం మరింతగా ప్రేక్షకులను మెప్పించింది.

పొలిమేర 3 కి సర్వం సిద్ధం..

ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సీక్వెల్స్, ఫ్రీక్వెల్స్ , సినిమాటిక్ యూనివర్స్, ఫ్రాంచైజీల ట్రెండు కొనసాగుతున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఈ క్రమంలోనే పొలిమేర 3 కూడా రాబోతోందని ఒక చిన్న గ్లింప్ రిలీజ్ చేశారు అనిల్ విశ్వనాథ్.. అంతేకాకుండా మూడవ కథ పార్ట్ గతంలోనే రాస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.. లూప్ హోల్స్, బ్లాక్స్ వదిలాను వాటిని సరి చేసుకుంటూ మూడో పార్ట్ ని కూడా సిద్ధం చేస్తున్నాను అంటూ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే ..అంతే కాదు ఇందులో స్టార్ హీరోలను కూడా యాడ్ చేస్తానని డైరెక్టర్ తెలిపారు ..ఇక ప్రస్తుతం ఒక గ్లింప్స్ విడుదల చేశారు.. కానీ ఇంకా ముఖాలను రివీల్ చేయలేదు.. మొత్తానికైతే ఇప్పుడు పొలిమేర త్రీ తో అంతకుమించి భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు అనిల్ విశ్వనాథ్.ఇక నటుడు పృథ్వీరాజ్ లెట్స్ బిగిన్స్ ది షో అంటూ టైమర్ రిపీట్ చేస్తూ గ్లింప్ స్టార్ట్ చేశారు.. ఇందులో పొలిమేర , పొలిమేర టు సన్నివేశాలను కూడా చూపించి పొలిమేర 3 పై హైప్ పెంచేశారు డైరెక్టర్.. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

- Advertisement -

/p>

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు