Pooja Hegde : ఐరన్ లెగ్ కు గోల్డెన్ ఆఫర్..?

టాలీవుడ్ లో ప్రస్తుతం ఐరన్ లెగ్ అంటే, వెంటనే గుర్తుకు వచ్చే పేరు పూజా హెగ్డే. “పూజా.. మన కాజా. లెగ్ పెడితే, సూపర్ హిట్” ఇది ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఓ సందర్భంలో అన్న మాట. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. “పూజా.. లెగ్ పెడితే డిజాస్టార్” అని అంటున్నారు నెటిజన్స్. ఇటీవల పూజా నటించిన “రాధేశ్యామ్” “బీస్ట్” “ఆచార్య” సినిమాలు భారీ డిజాస్టార్ గా మిగిలాయి.

దీంతో ఈ భామ్మకు ఐరన్ లెగ్ ముద్ర బలంగా పడిపోయింది. అయితే పూజాకు ఇంతలా ఫెయిల్యూర్స్ వచ్చినా, అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ బుట్ట బొమ్మ బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ తో “సర్కస్”, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో “కబీ ఈద్ కబీ దివాలీ” సినిమాలు చేస్తుంది. అలాగే టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ను కొట్టేసింది ఈ భామ.

టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ “జనగణమన” మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా మొదట సూపర్ స్టార్ మహేష్ బాబును అనుకున్నాడు పూరీ. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ లో హీరోగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎంపిక అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

- Advertisement -

ఈ సినిమా కోసం పూజా హెగ్డే 5 కోట్ల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసిందట. ఐరన్ లెగ్ గా ఉన్నా, ప్రేక్షకుల్లో పూజా కు ఉన్నఆదరణను చూసి చిత్ర బృందం 5 కోట్ల పారితోషికం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ వార్త నిజమైతే, తెలుగు చిత్ర సీమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా పూజా నిలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు