Pooja Hegde : పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకుంటున్న పూజా ?

స్టార్ హీరోయిన్ అన్న పేరును అతి తక్కువ సమయంలోనే సంపాదించుకున్నారు పూజ హెగ్డే. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలని స్టార్ హీరోలతో చేస్తున్నావే. రణ్‌వీర్ సింగ్ తోపాటు కలసి నటించిన ‘సర్కస్‌’ డిసెంబర్ చివరి వారంలో విడుదలను కానుంది.

అదే సమయంలో, ఆమె రెండు పెద్ద తెలుగు చిత్రాలలో భాగం కావాల్సి ఉంది. #SSMB28లో పూజ కన్ఫర్మ్ అయిన సంగ్రతి తెలిసిందే. దానితో పటు పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కనున్న సినిమాలో కూడా పూజ హీరోయిన్ అనే వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి పూజ తప్పుకున్నట్టు వార్తలొస్తున్నాయి. భ‌వాదీయుడు భ‌గ‌త్ సింగ్ ద్వారా తాను మూడోసారి తన డీజే హీరోయిన్‌ పూజా హెగ్డే తో క‌లిసి సినిమా చేయబోతున్నట్లు గతంలో దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం కొన్ని సమస్యల కారణంగా ఆమె ఈ మెగా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

హరీష్ మరియు పవన్ యొక్క భ‌వాదీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమా ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ గా మారి మొన్నే పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి మైత్రి మూవీ మేకర్స్ చేసిన అధికారిక పోస్ట్‌లలో పూజ కూడా ట్యాగ్ చేయబడలేదు. అదే సమయంలో, సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ స్టార్‌లెట్‌గా ఉన్న నటి ఈ సినిమా గురించి ఏమీ అంగీకరించలేదు. డేట్స్ ఇవ్వలేనందున ఆమె అధికారికంగా ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించినట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు