Poonam Kaur : గురూజీ స్క్రిప్ట్, దయ… ఇద్దరు భార్యలు, హీరో, డైరెక్టర్ అందర్నీ రౌండప్ చేసిన పూనమ్

Poonam Kaur : పూనమ్ కౌర్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు సినిమాల ద్వారా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం గురూజీ మీద సెటైర్లు వేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో మరోసారి గురూజీని ఏకిపారేసింది పూనమ్ కౌర్. అయితే ఈసారి ఆయన ఒక్కడిని మాత్రమే కాకుండా హీరో, ఇద్దరు భార్యల గురించి కూడా పూనమ్ మాట్లాడడం విశేషం.

డైరెక్టర్, హీరో, ఇద్దరు భార్యలు… గురూజీ స్క్రిప్ట్

పూనమ్ తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాలలో కూడా నటించి, నటిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. అయితే ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ రెండు ఇండస్ట్రీల కంటే ఆమె సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులారిటీని మూటగట్టుకుంటుంది. సినిమాలకు దూరమై చాలా కాలమే అయినప్పటికీ పూనమ్ కాంట్రవర్సీలతో ఎప్పటికప్పుడు అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ రాజకీయాలకు సంబంధించిన విషయాలే కాదు సినిమాలకు సంబంధించిన విషయాలపై కూడా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతుంది.

 Poonam Kaur Indirect Comments On Trivikram Pawan Kalyan Renu Desai Anna Lezinova-TeluguStop.com

- Advertisement -

అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే పవన్ కళ్యాణ్, గురూజీలపై ఆమె చేసే ట్వీట్లు మరో ఎత్తు. ఆమె వీళ్ళకు సంబంధించిన ట్వీట్లు ఎప్పుడు చేసినా అవి క్షణంలో దుమారాన్ని రేపుతాయి. తాజాగా మరోసారి గురూజీ స్క్రిప్ట్ అంటూ డైరెక్ట్ గానే సెటైర్ వేసింది. తన స్టోరీలో ఓ సుదీర్ఘ పోస్ట్ చేస్తూ పేర్లు మెన్షన్ చేయకుండానే అందరి గురించి మాట్లాడింది. ఎవరో భార్యగా వస్తారు, దీంతో అప్పటికే కట్టుకున్న దాన్ని పిల్లలతో సహా రోడ్డు మీదకు గెంటేస్తారు. భర్త ఎలాంటి పనులు చేసినప్పటికీ ఆ వచ్చే భార్యలు అంగీకరిస్తారు. కానీ కట్టుకున్నది మాత్రం జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. ఏదైతేనేం గురూజీ దయ వల్ల వచ్చిన ఆ భార్య మాత్రం సంతోషంగా ఉంటుంది. గురూజీ స్క్రిప్ట్… భారతీయ మహిళల బ్రెయిన్ ని చిన్నతనం నుంచే భర్త సుఖమే నీ సుఖం అని ట్యూన్ చేసి పెట్టారు. ఆమె చాలా మంచిది, నిజాయితీపరురాలు… ఏదైనా సరే ఎదుటివారికి ఇచ్చే గుణం అంటూ తన స్టోరీస్ లో రాసుకొచ్చింది. మొత్తానికి మరోసారి పూనమ్ గురూజీపై తన అక్కసును వెళ్ళగక్కడం హాట్ టాపిక్ గా మారింది.

అతనిది ఈవిల్ నేచర్..

రీసెంట్ గా అంటే ఇంస్టా స్టోరీస్ లో ఈ పోస్ట్ చేయడానికంటే ముందు గురూజీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది పూనమ్. అతనికి సపోర్ట్ చేసిన ఓ నెటిజన్ కు సమాధానం ఇస్తూ అతని ఈవిల్ నేచర్ గురించి నాకు తెలుసు. అలాగే మగవాళ్ళు ఈగో కోసం అతన్ని సపోర్ట్ చేస్తారని కూడా నాకు తెలుసు. నీ అనుభవంతో నువ్వు మాట్లాడితే నా అనుభవంతో నేను మాట్లాడుతున్నాను. త్రివిక్రమ్ ఇతరుల జీవితాలను నాశనం చేస్తాడు. అతని స్వభావం ఏంటో నాకు తెలుసు అంటూ మండిపడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు