Poorna: షాకింగ్….నటి పూర్ణను వేధించిన ఆ నటుడు….?

Poorna: టాలీవుడ్‌ సీనియర్‌ నటి పూర్ణ (Poorna) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం, నటనతో కొన్నేళ్ల నుంచి ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. పూర్ణ అసలు పేరు షమ్నా కాసిమ్. తన పేరును పూర్ణ అని స్క్రీన్ నేమ్ గా మార్చుకుంది. పూర్ణ మొదటగా అల్లరి నరేష్ నటించిన సీమటపాకాయ్ సినిమాలో హీరోయిన్ గా నటించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అవును సినిమాలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

ఆ సినిమాల అనంతరం పూర్ణకు (Poorna) హీరోయిన్గా అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అందులో భాగంగానే సిల్లీ ఫెలోస్, దృశ్యం 2, అఖండ వంటి చిత్రాల్లో నటించింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక పూర్ణ సినిమాలలో నటిస్తున్న సమయంలోనే దుబాయ్ కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేస్తుంది. వివాహ అనంతరం పూర్ణ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కొద్దిరోజుల పాటు గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత తన భర్త సహకారంతో తిరిగి మళ్ళీ పూర్ణ (Poorna) తన కెరీర్ కొనసాగిస్తోంది.

actress Purnaa said on social media that it was engagement
poorna

లేటెస్ట్ గా మొదలైన ఢీ సీజన్ లో జడ్జిగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా బుల్లితెరపై, సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తోంది. పూర్ణ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దసరా సినిమాలో విలన్ భార్య పాత్రలో నటించింది. ఇదిలా ఉండగా…. పూర్ణాకు సంబంధించిన వార్తా ప్రస్తుతం ఇండస్ట్రీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. పూర్ణ సినిమాల్లో నటిస్తున్న సమయంలో కేరళకు చెందిన ఓ హీరో తనని వేధించాడట. తనను వివాహం చేసుకోమని బలవంత పెట్టాడట. ఈ వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పూర్ణ సన్నిహితులు తెలపడం జరిగింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు