Popular Actor: పాపులర్ యాక్టర్ 18 కోట్లు పెట్టి ముంబైలో ఫ్లాట్ కొన్నాడు

Popular Actor: తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నటులలో రంగనాథన్ మాధవన్ ఒకరు. నటుడిగా, రచయితగా, సినీ నిర్మాతగా, ఎన్నో సినిమాలను నిర్మించి రెండుసార్లు ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నారు మాధవన్. ఇకపోతే దాదాపు ఏడు భాషల్లో నటించిన అతి తక్కువ మంది ఇండియన్ యాక్టర్స్ లో మాధవన్ ఒకరు. ముందుగా టీవీల్లో చిన్న చిన్న సీరియల్స్ లో కనిపించి ఆ తర్వాత కొన్ని యాడ్స్ లో నటించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మాధవన్. మణిరత్నం దర్శకత్వం వహించిన అలై పాయుదే సినిమాతో కెరియర్లో పెద్ద బ్రేక్ అందుకున్నాడు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన మిన్నాలే, మద్రా టాకీస్, డుం డుం డుం వంటి సినిమాలు మంచి బ్రేక్ ని తీసుకొచ్చాయి.

ఇక మాధవన్ తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే సుపరిచితం. చెలి,సఖి,యువ వంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన సవ్యసాచి సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు మ్యాడి. ఇక రీసెంట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ తో చాలా బిజీగా ఉన్నాడు మ్యాడి.

R Madhavan's

- Advertisement -

ఇలా ప్రస్తుతం మాధవన్ ముంబైలోని ఖరీదైన BKC ప్రాంతంలో 18 కోట్లకు కొత్త ఫ్లాట్‌ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఫ్లాట్ 4182 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మరియు రెండు కార్లు పార్కింగ్స్ అవకాశం ఉంది. ఈ ముంబై ఫ్లాట్‌తో పాటు, మాధవన్ ఇప్పటికే చెన్నైలో 15 కోట్ల బంగ్లా మరియు దుబాయ్‌లో ఫ్లాట్ కూడా కలిగి ఉన్నాడు. మాధవన్ చివరిసారిగా సూపర్ హిట్ హిందీ చిత్రం షైతాన్‌లో ప్రధాన పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం మాధవన్ ఫుల్ లైనప్ తో బిజీగా ఉన్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు