Devil : “డెవిల్”కు పాజిటివ్ టాక్… అంతా ప్రభాసే చేశాడు!

Devil : “బింబిసార” బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబోలో వచ్చిన రెండవ మూవీ “డెవిల్”. పీరియాడికల్ బ్యాక్ గ్రౌండ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన డెవిల్ మూవీకి అనూహ్యంగా పాజిటివ్ మౌత్ టాక్ వస్తోంది. అయితే దీనంతటికీ ప్రభాసే కారణం? మరి డెవిల్ మూవీకి, ప్రభాస్ కు మధ్య ఉన్న లింక్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ “డెవిల్” ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. నిజానికి ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పెద్దగా కాన్సెంట్రేట్ చేయలేదు మేకర్స్. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించలేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీకి ఇప్పుడు పాజిటివ్ టాక్ వస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మూవీ సెట్స్ లో ఉన్నప్పటి నుంచే వివాదాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. “డెవిల్” మూవీకి ముందుగా అనుకున్న డైరెక్టర్ నవీన్ మేడారం. సినిమా షూటింగ్ కొంతవరకు జరిగిన తర్వాత డైరెక్టర్ నవీన్, నిర్మాత అభిషేక్ నామాకు మధ్య విభేదాలు వచ్చాయి.

ఆ విభేదాల కారణంగా డైరెక్టర్ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత చిత్ర బృందం రిలీజ్ చేసిన ఓ పోస్టర్ పలు అనుమానాలను రేకెత్తించింది. ఆ పోస్టర్ లో ప్రొడ్యూసర్ అభిషేక్ నామా దర్శకుడిగా తన పేరును వేసుకోవడమే అందుకు కారణం. ఇక వీరిద్దరి మధ్య వివాదాలు అంటూ రోజుకో రూమర్ బయలుదేరింది. ఇద్దరూ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ సినిమా రిలీజ్ కు ముందు రోజు డైరెక్టర్ నవీన్ మేడారం ఈ సినిమా తన బేబీ లాంటిదని, డెవిల్ కోసం చాలా కష్టపడ్డాను అని, క్రెడిట్స్ లో డైరెక్టర్ గా తన పేరు లేనప్పటికీ ఈ సినిమాను తన సినిమాగానే భావిస్తానని తేల్చి చెప్పాడు. మరోవైపు ప్రొడ్యూసర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని, తన జీవితాన్ని అంకితం చేశానని చెప్పుకొచ్చాడు. అయితే 105 రోజుల షూటింగ్ పార్ట్ ను నవీన్ మేడారం చిత్రీకరించగా, ప్యాచ్ వర్క్ మాత్రం నిర్మాత అభిషేక్ నామా పూర్తి చేశాడని సమాచారం.

- Advertisement -

ఏదైతేనేం సినిమాకు మొత్తానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మరి ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా నాదంటే నాదంటూ వీరిద్దరూ మళ్ళీ సోషల్ మీడియాకు ఎక్కుతారేమో. కానీ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడానికి కారణం ప్రభాస్. ఎందుకంటే “డెవిల్” మూవీ ప్రమోషన్లలో చిత్ర బృందం “సలార్” టీంను ఫాలో అయింది. “సలార్” టీం కూడా సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. కేవలం ఒక్కటే ఒక ఇంటర్వ్యూ, పాటను మాత్రమే రిలీజ్ చేశారు. ఇక అదే మాటలో నడిచిన “డెవిల్” కేవలం ఇంటర్వ్యూలతో సరి పెట్టేసింది. కాబట్టి సినిమాపై హైప్ పెద్దగా పెరగలేదు. అదే “డెవిల్” మూవీకి పాజిటివ్ రావడానికి అతిపెద్ద కారణం అయింది. ఒకవేళ డెవిల్ టీం ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలను పెంచి ఉంటే కచ్చితంగా పాజిటివ్ టాక్ రావడం అసాధ్యమయ్యేది. కాబట్టి “డెవిల్” మూవీ పాజిటివ్ టాక్ అందుకోవడానికి కారణం ప్రభాసే.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు