Operation Valentine : ఇవే ప్లస్సులు, మైనస్ లు… వరుణ్ కి మరో డిజాస్టర్ పడినట్టే?

సరైన హిట్ కోసం పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈరోజు “ఆపరేషన్ వాలెంటైన్” అనే ప్రయోగాత్మక మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. మరి ఇంతకీ వరుణ్ ఈ మూవీతోనైనా హిట్ కొట్టినట్టేనా? లేదంటే తన ఖాతాలో మరో డిజాస్టర్ పడిందా? ఇంతకీ ఈ మూవీ ప్లస్, మైనస్ లు ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…

ప్లస్ లు…
“ఆపరేషన్ వాలెంటైన్” ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాట్ గా సాగిపోయింది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఎటాక్ చేసే సీన్ అట్రాక్ట్ చేస్తుంది. ఇక మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతానికి విమర్శకుల నుంచి మంచి మార్కులే పడతాయి. సినిమా రిలీజ్ కు ముందు 50 కోట్లతో రూపొందిన ఈ మూవీ విజువల్స్ పరంగా వండర్స్ క్రియేట్ చేస్తుంది అని టాక్ నడిచింది. కానీ గతంలో ఇదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్సెప్ట్ తో వచ్చిన “యు : ది సర్జికల్ స్ట్రైక్”, “ఫైటర్” వంటి సినిమాలతో పోలిస్తే, “ఆపరేషన్ వాలెంటైన్” విజువల్స్ తేలిపోతాయి. కానీ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే కొంత వరకు వీఎఫ్ఎక్స్ ఫర్వాలేదు.

మైనస్ పాయింట్స్
“ఆపరేషన్ వాలెంటైన్” మూవీలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాల కంటే నిరాశపరిచే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్, హీరోయిన్ల గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్ పూర్తిగా బాలీవుడ్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తీశాడు. కనీసం తెలుగు ఆడియన్స్ నాడి గురించి తెలుసుకోవడానికి ఈ డైరెక్టర్ చిన్న ప్రయత్నం కూడా చేయలేదన్న విషయం సినిమాను చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చాలదన్నట్టు టేకింగ్ పరంగా కూడా నిరశపరిచాడు. ఫస్టాఫ్ అంతా చాలా ఫ్లాట్ గా సాగుతుంది. ప్రతి రెండు నిమిషాలకి ప్రేక్షకులు థియేటర్లలో వెండితెరను చూడటం కన్నా ఫోన్లు చూసుకోవడం ఖాయం. విజువల్స్ పరంగా కూడా పెద్దగా ఈ మూవీ ఆకట్టుకోదు. హై మూమెంట్స్ కి స్కోప్ ఉన్నా డైరెక్టర్ అలాంటి మెరుపులు దిద్దే ప్రయత్నాలు ఏవీ చేయలేదు. కనీసం ప్రమోషన్స్ లో వరుణ్ చెప్పినట్టుగా దేశభక్తి, ఎమోషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్లోకి అడుగు పెట్టిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. ఏ దశలోను ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వదు. బాలీవుడ్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ డైరెక్టర్ చేసిన ప్రయత్నం వృధా అనిపిస్తుంది. ఇప్పటికే “యురి”, “ఫైటర్” వంటి సినిమాలు చూసిన నార్త్ ఆడియన్స్ కు ఈ మూవీ పెద్దగా నచ్చకపోవచ్చు.

- Advertisement -

హీరోయిన్ మరో మైనస్…
సినిమాలో నటీనటుల పనితీరు గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ముఖ్యంగా ఈ సినిమాకు మైనస్ అనగానే హీరోయిన్ గుర్తొస్తుంది. “ఆపరేషన్ వాలెంటైన్” మూవీలో మానుషి చిల్లర్ లుక్స్ అసలేమి బాలేవు. ఆమె కంటే సౌత్ హీరోయిన్ రుహాని శర్మనే బెటర్ గా కనిపిస్తుంది. కనీసం నటనపరంగా అయినా ఆమె ఆకట్టుకుంటుందేమో అని ఆశిస్తే, ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడమే వేస్ట్. మొత్తానికి ఈ మూవీతో వరుణ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు