Pottel Lyrics Song: “బుజ్జి మేక”.. లిరిక్స్ సాంగ్ వైరల్.. ఎమోషనల్ తో కట్టిపడేశారుగా..?

Pottel Lyrics Song..ప్రముఖ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ , యంగ్ హీరో యువ చంద్ర కృష్ణ తాజాగా నటించిన చిత్రం పొట్టేలు. 2020లో వచ్చిన సవారీ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి అరంగేట్రం చేసిన సాహిత్ మోత్కూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. T – సిరీస్ బ్యానర్ పై.. నిషా ఎంటర్టైన్మెంట్స్ పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఆర్ట్ డైరెక్టర్ గా నార్ని శ్రీనివాస్, ఎడిటర్ గా కార్తీక్ శ్రీనివాస్ పనిచేస్తున్నారు.

ఆకట్టుకున్న టీజర్..

Pottel Lyrics Song: "Buzzy Goat".. Lyrics Song Viral.. Emotionally hooked..?
Pottel Lyrics Song: “Buzzy Goat”.. Lyrics Song Viral.. Emotionally hooked..?

ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఏప్రిల్ 18న టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది .. నిజానికి గత ఏడాది చివర్లోనే ఈ సినిమా కథ ప్రారంభమైనా.. నేటికీ విడుదలకు నోచుకోలేదు. ఇదిలా ఉండగా బోనాల వేడుకలు , జోగిని రంగం ప్రదర్శించడం లాంటి ఘట్టాలతో ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇక ఒక గొప్ప చిత్రాన్ని చేస్తున్నాననే ఫీలింగ్ తనకు కలిగింది అని.. ఈ చిత్ర టీజర్ లాంచ్ లో అనన్య నాగళ్ళ తెలిపిన విషయం తెలిసిందే.. ఇక సినిమా కథ రాయడం మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటివరకు అదే ఉత్సాహంతో పనిచేశాను అని డైరెక్టర్ కూడా తెలిపారు.

బుజ్జి మేక అంటూ లిరికల్ సాంగ్ విడుదల..

ఇక త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పిన ఈ చిత్ర బృందం.. తాజాగా ఈ సినిమా నుంచి రెండవ పాటని కూడా విడుదల చేయడం జరిగింది. గతంలో “శంకర నీవే దిక్కు రా” అంటూ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ పాటలో చాలా కొత్త పదాలు చేర్చడమే కాదు వినడానికి కూడా చాలా బాగుందని శ్రోతలు ఇటీవలే పాటపై పాజిటివ్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే . ఇప్పుడు అదే ఊపుతో రెండో పాటకు సంబంధించి లిరిక్స్ ను కూడా విడుదల చేయడం జరిగింది.. “బుజ్జిమేక.. మంద ముందు నడిచే నడిచే.. బుల్లి గువ్వ రెక్క తొడిగి ఎగిరే ఎగిరే ” అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ కూడా మరొకసారి మ్యాజిక్ చేసిందని చెప్పాలి. శేఖర్ చంద్ర మ్యూజిక్.. కాలభైరవ గానం రెండూ కూడా పాటను మరింత అద్భుతంగా మార్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ మీనింగ్స్ కూడా చాలా ఎమోషనల్ గా అనిపిస్తున్నాయి.. పాట చాలా బాగుంది అని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. “బ్రతుకనే బాయిలో.. మునిగిపోకుండా అక్షరం ఈతలా తోడవద.. కొండలా కష్టమే ఎదుటే నిలుచున్నా.. పదం నీ పాదమై నడిపించదా” అంటూ సాగుతున్న ఈ లిరిక్స్ చాలా ఎమోషనల్ గా ఉన్నాయని చెప్పవచ్చు.

- Advertisement -

ట్రెండింగ్ లో బుజ్జిమేక సాంగ్..

ఈ పాట యూట్యూబ్లో విడుదలైన మూడు గంటల్లోనే ఏకంగా 6.1 కే వ్యూస్ సాధించింది. ఇక ఇందులో అనన్య పల్లెటూరి అమ్మాయిలా కనిపించి తన అందంతో ఆకట్టుకుందని చెప్పవచ్చు. మొత్తానికైతే సినిమా నుంచి విడుదలైన పాటలు , టీజర్, పోస్టర్ అన్నీ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.. ఇవన్నీ సినిమాపై హైప్ పెంచేస్తున్నాయనటంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు