Kalki: కల్కి కి మొదటి హీరో అమితాబ్ బచ్చన్ అని ఒప్పుకున్న ప్రభాస్

Kalki: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన చిత్రం అంటే కల్కి అని చెప్పొచ్చు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పెట్టిన బడ్జెట్ కూడా రికవరీ అయిపోయిందని చెప్పొచ్చు. ఈ సినిమా కలెక్షన్స్ దాదాపు 700 కోట్లను దాటిపోయాయి. మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ జానెర్ లో వచ్చిన మొదటి సినిమా ఇది. దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.

ఇకపోతే ఈ సినిమా దాదాపు నాలుగు భాగాలుగా రానున్నట్లు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే మొదటి భాగంలో కేవలం 20 నిమిషాలు మాత్రమే కనిపించిన కమల్ హాసన్, రెండవ భాగంలో దాదాపు 90 నిమిషాల పాటు కనిపిస్తారని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే వంటి నటులతో పాటు మిగతా ఇండస్ట్రీ నుంచి చాలా ప్రముఖులు కూడా ఈ సినిమాలో కనిపించారు. తెలుగు డైరెక్టర్లు కూడా అక్కడక్కడా దర్శనం ఇచ్చారు.

Kalki 2898 AD

- Advertisement -

కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ అశ్వద్ధామ. సినిమా మొదటి నుంచి కూడా చివరి వరకు అమితాబచ్చన్ నటించిన తీరు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా చూసి బయటికి వచ్చిన చాలామంది ఈ సినిమాకి అసలైన హీరో అమితాబచ్చన్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్గా అశ్విని దత్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకి అసలైన హీరో అమితాబచ్చన్ అని ప్రభాస్ తనతో అన్నారని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి అసలైన హీరో అమితాబచ్చన్ సో మనం ఆయనను గౌరవించాలి అలానే కమల్ హాసన్ గారితో చేయాలనుకున్న నా డ్రీమ్ కూడా పూర్తయింది అంటూ ప్రభాస్ అశ్విని దత్ తో చెప్పాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు