Prabhas : రాజు కాదు.. రారాజు.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించిన ప్రభాస్..

Prabhas : దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అల్లాడుతున్నారు. మొన్న కేరళ రాష్ట్రాన్ని కుదిపేసిన భారీ వరదలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ముంచేత్తుతున్నాయి.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. అటు ఆంధ్రప్రదేశ్ ను, ఇటు తెలంగాణను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల కారణంగా ఎన్నో గ్రామాలు నీట మునిగాయి. ఎన్నో వందల మంది ప్రాణాలను కోల్పోయారు. తెలుగు ప్రజల అవస్థలు వర్ణనాతీతం. కనీసం ఫుడ్ కూడా దొరకని పరిస్థితులలో జనాలు ఉన్నారు. వీరిని ఆదుకోవడం కోసం రాజకీయ నేతలతో పాటు సినీ సెలెబ్రేటీలు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ముందుకు వచ్చి విరాళాన్ని అందిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ప్రభాస్ ( Prabhas) మంచి మనసు చాటుకొని భారీ విరాళాన్ని ప్రకటించారు.

ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ ముందుకు వస్తున్నారు. పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భారీ విరాళాన్ని ప్రకటించాడు. రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 5 కోట్లు విరాళాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. రెండు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ఈ వార్త విన్న అయన ఫ్యాన్స్ డార్లింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు ప్రకటించారు.

Prabhas announced huge donation to Telugu states..
Prabhas announced huge donation to Telugu states..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు వరద బీభత్సంలో అతలాకుతలం అవుతున్నాయి.. వరద పరిస్థితిని చూసి అందరూ కలత చెందుతున్నారు. ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి మంచి నీరు లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. జూనియర్ ఎన్టీఆర్ (NTR) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), అశ్వనీదత్ ( Aswini Dutt), మహేశ్ బాబు (Mahes Babu ), విశ్వక్ సేన్ (viswak sen ) ఇలా ఒక్కొక్కరు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని వరద భాదితుల సహాయార్థం కోసం ప్రభాస్ రూ. 5 కోట్లు విరాళం ప్రకటించినట్లు వార్తలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. కానీ నిజానికి ప్రభాస్ మాత్రం చెరో కోటి రూపాయలు ఇచ్చినట్లు తాజాగా ఆయన టీమ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు