Prabhas : ప్రభాస్ బర్త్ డే సర్ ప్రైజ్ రెడీ.. ఆ సినిమా రీరిలీజ్.. ఫ్యాన్స్ కు పునకాలు పక్కా..

Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాలు ఒక్కొక్కటి విడుదల కాబోతున్నాయి. గతంలో రిలీజ్ అయినప్పుడు ఎటువంటి అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే కూడా అదే హవాను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలు రీరిలీజ్ అయ్యి భారీ ప్రభంజనాన్ని సృష్టించాయి. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఓ బ్లాక్ బాస్టర్ సినిమా కూడా రిలీజ్ కాబోతుందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆ సినిమా ఏంటో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూద్దాం..

మాములుగా హీరోల బర్త్ డే సందర్భంగా విజయం సాధించిన సినిమాలను ప్రేక్షకుల ముందుకు మళ్లీ తీసుకొస్తున్నారు. కాగా.. అక్టోబర్ 23న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 45వ పుట్టినరోజును జరుపుకొంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించిన రెండు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. దాంతో ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా దక్కనుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్, డార్లింగ్ సినిమాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలు ఆయన పుట్టినరోజు సందర్బంగా సర్ ప్రైజ్ చెయ్యడానికి ఆ సినిమాల మేకర్స్ ఆ సినిమాలను రీరిలీజ్ చేయబోతున్నారు.. తాజాగా ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే..

Prabhas birthday surprise ready.. Rerelease of those movies.
Prabhas birthday surprise ready.. Rerelease of those movies.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరే ఉంది.. రీసెంట్ గా కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత చేసింది. ప్రభాస్ కేరీర్ కు కల్కి సినిమా మరో టర్నింగ్ పాయింట్ అయ్యింది.. ఆ సినిమా వచ్చి రెండు నెలలు అయిన కూడా మౌత్ టాక్ అలానే కొనసాగుతుంది.. ప్రస్తుతం ఓటీటిలోకి కూడా రాబోతుంది. ఇక రాజా సాబ్ సినిమాతో త్వరలో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత సలార్ 2, స్పిరిట్ మూవీలను చేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు