Kalki: వివాదాల్లో చిక్కుకున్న ప్రభాస్ ” కల్కి “.. ఆ ఆర్ట్ నాదే అంటూ ఫైర్..!

Kalki: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కల్కి. తాజాగా ఈ మూవీ కాపీ వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీ ట్రైలర్ లోని ఇంట్రో సీన్ కాన్సెప్ట్ ను కాపీ చేశారని సౌత్ కొరియా కు చెందిన కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఆరోపణలు చేశాడు.

హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంగ్ చోయ్ తాను పదేళ్ల క్రితం క్రియేట్ చేసిన ఆర్ట్ ను కల్కి బృందం తన అనుమతి లేకుండా ఉపయోగించిందని ఆరోపణలు వ్యక్తం చేశాడు. ట్రైలర్ లో కాపీ కి సంబంధించిన పిక్స్ ను తన ఆర్ట్ తో పోల్చుతూ instagram వేదికగా కల్కి టీం పై ఫైర్ అయ్యాడు.

Prabhas caught in controversies "Kalki"
Prabhas caught in controversies “Kalki”

ఇక దీనిపై తన కళాకృతిని అనుమతి లేకుండా ఉపయోగించడం కరెక్ట్ పని కాదంటూ.. ఈ చట్ట విరుద్ధమైన పని నన్ను ప్రశ్నించేలా చేస్తుంది అని పేర్కొన్నారు. ఇక దీనిపై ఇప్పటివరకు కల్కి టీం ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. కాగా నాగ్‌ అశ్విన్ డైరెక్షన్ వహిస్తున్న ఈ మూవీ యొక్క ట్రైలర్ సోమవారం విడుదల చేశారు. ఇక ట్రైలర్ విడుదలైన అనంతరం ప్రేక్షకులు కల్కి యొక్క పోస్ట్.. అపోకలిప్టిక్ ప్రచారం హాలీవుడ్ చిత్రాలైన డూన్ అండ్ మ్యాడ్ మ్యాక్స్, ఫ్యూరీ రాడ్ వంటి చిత్రాలను కాపీ చేశారని అన్నారు. ‌

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు