Prabhas: నాగ్ అశ్విన్ ఆ సినిమాను ప్రభాస్ తో చెయ్యాలి అనుకున్నాడా.?

Prabhas: ఈశ్వర్ సినిమాలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. అయితే ప్రభాస్ కు మాత్రం మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా వర్షం. బాక్సాఫీస్ వద్ద సినిమా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరోగా ప్రభాస్ ను నిలబెట్టింది. అక్కడ నుంచే ప్రభాస్ కి చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమాతో ప్రభాస్ స్టార్ హీరో అయిపోయాడు. ఆ తర్వాత చేసిన డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలు ప్రభాస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేశాయి. గురు జగనన్న దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు ఏక్ నిరంజన్ వంటి సినిమాలు యూత్ లో ఒక ఫాలోయింగ్ తీసుకొచ్చి పెట్టాయి.

Prabhas

నీకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాని మొదటిసారి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంత టాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నారా అని అందరికీ తెలిసి వచ్చిన పరిణామం అది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతూ వచ్చింది. అయితే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచినా కూడా, మినిమం కలెక్షన్స్ అయితే వచ్చాయి అని చెప్పొచ్చు. రీసెంట్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మంచి ఊపు మీద ఉన్నాయి.

- Advertisement -

ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గా ఒక ఆసక్తికరమైన విషయాన్ని రివిల్ చేశారు నిర్మాత స్వప్న దత్. ప్రభాస్ తో నాగి ఎప్పటినుంచో కలిసి పని చేయాలి అని అనుకుంటున్నాడు. అది ఇప్పటికి కుదిరింది. నాగి దర్శకుడిగా పరిచయమైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను కూడా ప్రభాస్ తో చేయాలి అనుకున్నాడంట. కానీ అది కుదరలేదు కానీ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఆ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు. ఇప్పుడు ప్రభాస్ కల్కి సినిమా చేయడంలో కూడా కృష్ణంరాజు పాత్ర ఉందని ఇదివరకే చాలాసార్లు చాలా వార్తలు వినిపిస్తూ వచ్చాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు